-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విసవి సెలవల్లో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు పార్కుల అభివృద్ధి మరియు నిర్వాహణలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ముత్యాలంపాడు, సత్యనారాయణపురం, గాంధీనగర్, హనుమాన్ పేట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పార్కుల అభివృద్ధి మరియు నిర్వహణ పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వేసవికాలం నేపథ్యంలో, చిన్నారులకు వేసవి సెలవులు ఉంటాయి కాబట్టి ప్రజలు పార్కులలో ఎక్కువ సమయాన్ని గడిపేలా ఆహ్లాదకరమైన వాతావరణంలో పార్కులను ఉంచాలని, నిత్యం పారిశుద్ధ్య నిర్వహణ, వసతుల నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని అధికారులను ఆదేశించారు. సత్యనారాయణపురంలోని ఏఎస్ఆర్ పార్క్ ను పరిశీలించి ఓపెన్ జిమ్ అందుబాటులో ఉన్నందున ప్రజలు ఈ వేసవిలో ఉపయోగించేలా చర్యలు తీసుకోవడమే కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఏమన్నా మరమ్మతులు ఉన్నచో వెంటనే వాటిని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గవర్నర్‌పేటలోని గోరా పార్క్ పరిశీలించి అక్కడ వారు కూర్చునేందుకు సౌకర్యాలు పెంచి అందంగా ఆహ్లాదంగా మార్చేటట్టు చర్యలు తీసుకోవాలన్నారు. తదుపరి హనుమాన్ పేటలోని చిత్తూరి విశ్వేశ్వరయ్య పార్క్ పర్యటించి అక్కడ పిల్లల కోసం క్రికెట్ ఆడుటకు నెట్టును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వేసవి దృశ్య ప్రతి పార్కును అధికారులు పర్యవేక్షించి ఎటువంటి మరమ్మతులు లేకుండా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (పార్క్స్) ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News