Breaking News

“మనసు” ఫౌండేషన్ ను సందర్శన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాహిత్య, శాస్త్రీయ పుస్తకాలను భావితరాలకు అందించేందుకు “ మనసు” ఫౌండేషన్ ద్వారా రాయడు, డా॥
గోపాలకృష్ణ చేస్తోన్న కృషిని సి.ఆర్. మీడియా అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ అభినందించారు. ఈ ప్రయత్నాన్ని గొప్ప యజ్ఞంగా ఆయన అభివర్ణించారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని ‘కన్యంపాడు’ గ్రామంలోని “మనసు” ఫౌండేషన్ ను మంగళవారం ఛైర్మన్ సందర్శించారు. సాహిత్యం, కథ, కవిత్వం యే విభాగానికి చెందిన ప్రాచీన, ఆధునిక పుస్తకాలను డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా భావితరాలకోసం భద్రపరచడం ముదావహం అని అన్నారు. ఇప్పటికే 15 వేల పుస్తకాలను డిజిటలైజ్ చేసిన తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. మనసు ఫౌండేషన్ లో వివిధ వ్యవస్థలైన స్కానింగ్, డిజిటలైజేషన్, ప్యాకింగ్ విభాగాలను అయన సందర్శించి అక్కడి ఉద్యోగులనుంచి పలువిషయాలు తెలుసుకున్నారు.
మనసు ఫౌండేషన్ ను 2018 వ సంవత్సరం మార్చి 18 న ప్రారంభించామని రాయుడు ఛైర్మన్ కు తెలిపారు. తమ ఫౌండేషన్ ద్వారా 30 మందికి ఉపాధి లభిస్తోందని అయన వివరించారు. తమ వద్ద వున్న పుస్తకాలను డిజిటలైజేషన్ ప్రక్రియ కు దాతలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, వెంకటేష్, రహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *