గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2026-27) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించి పన్నుపై 5 శాతం, బకాయిల వడ్డీపై 50 శాతం రాయితీ పొందేందుకు గురువారం ఒక్క రోజే గడువు ఉందని, నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కె.మయూర్ అశోక్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నును ముందస్తుగా ఏక మొత్తంగా చెల్లించే వారికి ప్రకటించిన 5 శాతం రాయితీని నగర ప్రజలు విస్తృతంగా వినియోగించుకుంటున్నారని, బుధవారం ఎల్వీఆర్ అండ్ క్లబ్ రూ.15,25,000ల చెక్ ని డిప్యూటీ కమిషనర్ కి అందించారు. రాయితీ లోఒక్కరోజే గడువు ఉందన్నారు. ఇప్పటికే రాయితీతో రూ.63.59కోట్లు చెల్లించారని, ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్నుబకాయిలను ఒకేసారి ఏక మొత్తంగా చెల్లిస్తే వారికి వడ్డీపై 50 శాతం రాయితీని కూడా పొందవచ్చని తెలిపారు. నగరంలోని ఆస్తి, ఖాళీ స్థల పన్నుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకొని ఈ నెలాఖరు లోపు ఆస్తి పన్ను చెల్లించి రాయితీ పొందాలని కోరారు. పన్ను చెల్లింపుదారులకు వీలుగా పన్ను సేకరణ క్యాష్ కౌంటర్లు ఉదయం 7 గంటల నుండి అర్ధ రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Prajavartha Online Telugu News