విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సోషల్ మీడియాలో ప్రజల సమస్యలపై ప్రశ్నించినందుకు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకుడు కరిముల్లాపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేయడం అత్యంత దారుణమైన చర్య అని ఎన్టీఆర్ జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలపై ప్రశ్నించడం ప్రతి పౌరుడి హక్కు అని, ఆ హక్కును అణచివేయడానికి కూటమి ప్రభుత్వం హింసాత్మక మార్గాలను ఆశ్రయించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం తప్పు కాదని, అలాంటి స్వరాలను తెలుగుదేశం పార్టీ నేతలు భయపెట్టడం అసహ్యకరమని పేర్కొన్నారు.ఈ ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తుతోందని అన్నారు. దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకుని, బాధ్యులను అరెస్ట్ చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరిముల్లాకు తగిన రక్షణ కల్పించి, న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం అయితే వైస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
Prajavartha Online Telugu News