Breaking News

ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేశానికే దిక్సూచి:మంత్రి కందుల దుర్గేష్

-విద్యాశాఖలో మంత్రి లోకేష్ మార్క్ సంస్కరణలతో అక్షరాలా అమలవుతున్న కొఠారి కమిషన్ ఆశయాలు..విద్యా సంస్కరణల సారథి మంత్రి నారా లోకేష్‌పై మంత్రి కందుల దుర్గేష్ ప్రశంసలు
-కూటమి ప్రభుత్వ రెండేళ్ల కాలంలో 16,000 పోస్టులతో మెగా డీఎస్సీ – విద్యాశాఖలో నూతన అధ్యాయనానికి శ్రీకారం చుట్టామని వెల్లడి..కూటమి ప్రభుత్వం విద్యా వికాసానికి అండగా నిలుస్తుందన్న మంత్రి దుర్గేష్
-ప్రభుత్వ బడుల్లోనే పిల్లల భవిష్యత్తు – తల్లులకు అండగా ఏటా రూ.15,000తో ‘తల్లికి వందనం’..ఒత్తిడి లేని విద్య.. శనివారం ‘నో బ్యాగ్ డే’ – నైతిక విలువలకు పెద్దపీట:మంత్రి దుర్గేష్
-నాణ్యమైన కిట్లు, పోషక ఆహారం.. ప్రభుత్వ బడిలో కార్పొరేట్ స్థాయి వసతులు..అంగన్‌వాడీ నుంచే అక్షర ప్రయాణం మొదలవ్వాలని మంత్రి దుర్గేష్ ప్రకటన
-కార్పొరేట్‌కు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలలు..మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి – మీ బిడ్డ భవిష్యత్తును వెలిగించండి అంటూ తల్లిదండ్రులకు మంత్రి దుర్గేష్ పిలుపు
-ప్రభుత్వ బడి గెలుస్తోంది – నిలుస్తోంది.. మన బడులను భవితకు, చరితకు సాక్ష్యాలుగా నిలుపుదామని కలెక్టర్లు, యంత్రాంగానికి మంత్రి దుర్గేష్ పిలుపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
“దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది” అన్న డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి మాటలను అక్షరాలా నిజం చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టారని పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రి లోకేష్ పర్యవేక్షణలో దాదాపు 16,000 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని అత్యంత సమర్థవంతంగా నిర్వహించి ప్రభుత్వ బడులకు పూర్వ వైభవం తీసుకువచ్చారని బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బడుల్లో పిల్లల చదువులకు అనువైన వాతావరణం కల్పించడంలో మంత్రి లోకేష్ రాజీలేని కృషి చేస్తున్నారని మంత్రి దుర్గేష్ అన్నారు. నాణ్యమైన యూనిఫాంలు, పుస్తకాలు, షూ, బ్యాగులతో పాటు పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. ముఖ్యంగా ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఏటా రూ.15,000 అందిస్తూ కూటమి ప్రభుత్వం పేద తల్లులకు కొండంత అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు.శనివారం ‘నో బ్యాగ్ డే’ ద్వారా ఆటపాటలు, నైతిక విలువల బోధనతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి విశాలమైన ఆట స్థలాలు, యోగా శిక్షణ, కళలు మరియు సృజనాత్మకతకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. అత్యున్నత శిక్షణ పొందిన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో మెరుగైన బోధన అందిస్తున్నామన్నారు. “కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మన ప్రభుత్వ బడి గెలుస్తోంది.. నిలుస్తోంది. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయాలి. అంగన్‌వాడీ కేంద్రాల నుంచే ఈ విద్యా ప్రయాణాన్ని ప్రారంభించండి” అని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, పాఠశాల యాజమాన్య కమిటీలు సమన్వయంతో పనిచేసి ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను దేశానికే దిక్సూచిగా నిలపాలని ఆయన ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *