అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్వయం సహాయక సంఘాల (SHG) మహిళల జీవనోపాధిని మెరుగుపరచడం మరియు సెర్ప్ (SERP) ద్వారా ‘దీన్ దయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్’ (DAY-NRLM) పథకాన్ని అమలు చేయడం కోసం.. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా మొదటి విడతలో రూ.207.03 కోట్లు మంజూరు చేయడం పట్ల రాష్ట్ర ఎంఎస్ఎంఈ (MSME), సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను, ఎన్.ఆర్.ఎల్.ఎం (NRLM) కింద స్వయం సహాయక సంఘాలకు మొత్తం రూ.690 కోట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో:
-కేంద్ర ప్రభుత్వ వాటా: మొదటి విడతగా రూ.207.03 కోట్లు మంజూరు.
-రాష్ట్ర ప్రభుత్వ వాటా: రాష్ట్ర ప్రభుత్వం తన 40% మ్యాచింగ్ గ్రాంట్‌ను దీనికి జోడించి నిధులను విడుదల చేస్తుంది.
కేంద్ర మంత్రులకు ధన్యవాదాలు:
ఈ నిధుల విడుదలకు సహకరించిన భారత ప్రభుత్వానికి మరియు కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
మహిళా పారిశ్రామికవేత్తల సాధికారత:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ఈ ఏడాది రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్నామని మంత్రి పేర్కొన్నారు. మంజూరైన ఈ నిధులు మహిళల ఆర్థిక అభివృద్ధికి మరియు వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చడానికి ఎంతో దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags amaravathi
Check Also
ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ
-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …
Prajavartha Online Telugu News