-యువనేత నారా లోకేష్ మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని రాజశ్యామల యాగం
-కృష్ణా జిల్లా మొవ్వ మండలం కారంకంపాడులో నిర్మించిన శ్రీముఖ లింగేశ్వరస్వామి వారి దేవస్థానం ప్రముఖమైనదిగా నిలుస్తుంది
-రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ యజ్ఞాలు, యాగాలు నిర్వహిస్తున్నాం
-ఏపీ సమాచార మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మొవ్వ మండలంలోని కారకంపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాత్రిపురసుందరీ సమేత శ్రీముఖలింగేశ్వర స్వామి ప్రతిష్ట కార్యక్రమాన్ని భక్తులంతా జయప్రదం చేయాలని రాష్ట్ర సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి కోరారు. కారకంపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన దేవాలయం ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడారు. ఈశ్వరుడి దయతో రాష్ట్రానికి మేలు జరగాలని, రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలతో రాష్ట్రం కళకళలాడాలనే ఉద్దేశంతో యజ్ఞ, యాగాలు నిర్వహిస్తున్నామన్నారు. యువనేత నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా పార్టీని మరియు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చేస్తున్న ప్రయత్నాలు అన్నీ సఫలీకృతం కావాలనే ఉద్దేశంతో లోకేష్ నామ, గోత్రాల మీద రాజశ్యామలయాగం నిర్వహించామని, ఈశ్వరుడి దయతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని, రాష్ట్ర యువత భవిష్యత్తు బాగుండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ , ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కి ఈశ్వరుడి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని మంత్రి పార్థసారథి ఆకాంక్షించారు మే 1న జరగనున్న మహాప్రతిష్ట కార్యక్రమానికి భక్తులు విచ్చేసి జయప్రదం చేయాలని మంత్రి కోరారు.
Prajavartha Online Telugu News