అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన 1385 వ (48వ) క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్యపన్నులు మరియు శాసన సభ వ్యవహారాల శాఖామాత్యులు పయ్యావుల కేశవ్ మీడియాకు వివరించారు…
హోం శాఖ
1. హోం శాఖ: AP స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 2000 బ్యాచ్ కానిస్టేబుళ్ళను హెడ్ కానిస్టేబుళ్ళుగా పదోన్నతి కల్పించడానికి 385 కానిస్టేబుల్ పోస్టులను హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు అప్‌గ్రేడ్ చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇందుకు సమానమైన సంఖ్యలో కానిస్టేబుల్ పోస్టులు రద్దు అవుతాయి.
న్యాయ శాఖ
2. న్యాయ శాఖ (కోర్టులు): హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జిల్లా న్యాయవ్యవస్థ మరియు రాష్ట్రంలోని న్యాయ విభాగాల్లో మొత్తం 21 నూతన పోస్టుల (1 చీఫ్ కోర్ట్ మేనేజర్, 5 సీనియర్ కోర్ట్ మేనేజర్లు మరియు 15 కోర్ట్ మేనేజర్లు) కల్పనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
3. న్యాయ శాఖ: న్యూ ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్, అడ్వకేట్స్-ఆన్-రికార్డ్ కార్యాలయంలో ఆఫీస్ మేనేజర్ పోస్ట్‌ను సెక్షన్ ఆఫీసర్ స్థాయికి అప్‌గ్రేడ్ చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఒక ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ రద్దు చేసి, రూ.57,100-1,47,760/- స్కేల్లో ఈ అప్‌గ్రేడేషన్ జరుగుతుంది.
పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి
4. పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి: శ్రీకాళహస్తిలోని APSIRD&PR మరియు 3 ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ సెంటర్లు (ETCs)లో 20 రెగ్యులర్ మంజూరైన పోస్టులు నియంత్రించి 20 పోస్టులు (6 రెగ్యులర్ + 14 అవుట్సోర్సింగ్) సృష్టించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంతేకాకుండా, APSIRD&PR మరియు ETCs, సామర్లకోట మరియు శ్రీ కాళహస్తిలో మంజూరైన రెగ్యులర్ పోస్టులకు నియంత్రించి ఒక సంవత్సరం పాటు 9 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి అనుమతి ఇచ్చింది.
పరిశ్రమలు & మౌలిక సదుపాయాలు (పోర్టులు)
5. పరిశ్రమలు & మౌలిక సదుపాయాలు (పోర్టులు): ప్రకాశం జిల్లా రామాయపట్నంలో EPC విధానంలో అమలు అవుతున్న “గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ నిర్మాణం” ప్రాజెక్టుకు సంబంధించిన వ్యత్యాస పనుల (Variation Works) కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇందులో, (1) డ్రెడ్జింగ్ ద్వారా తీసిన మట్టిని పారబోయే ప్రదేశం మార్పు కారణంగా ప్రాజెక్టు వ్యయంలో వచ్చిన మార్పు (Variation-1) మరియు (2) SPT N-విలువ 40 కంటే ఎక్కువ ఉన్న మట్టి పొరల్లో డ్రెడ్జింగ్ నిర్వహణ వల్ల ఏర్పడిన అదనపు వ్యయం (Variation-2)లను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ రెండు అంశాల కారణంగా మొత్తం రూ. 354,23,81,192/- (GST మరియు ఇతర వర్తించే పన్నులు సహా) వ్యయం పెరుగుదలకు అనుమతిని మంజూరు చేయడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల ప్రకాశం జిల్లా రామాయపట్నంలోని గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణం త్వరగా పూర్తవుతుంది మరియు ఇది రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను మరింత పెంపొందిస్తుందని భావిస్తున్నారు.
వ్యవసాయం & సహకారం
6. వ్యవసాయం & సహకారం: రబీ 2025-26 (KMS 2025-26) సీజన్లో వరి సేకరణ, DCP మరియు PDS కార్యకలాపాల అవసరాలు తీర్చడానికి AP మార్క్‌ఫెడ్‌కు NCDC నుండి రూ.1800 కోట్ల ఫ్రెష్ వర్కింగ్ క్యాపిటల్ లోన్ (WCL) తీసుకోవడానికి ప్రభుత్వ హామీతో అనుమతి ఇచ్చింది. ఈ మొత్తాన్ని APSCSCL కు అంతర్-కార్పొరేట్ రుణంగా బదిలీ చేయడానికి కూడా ఆమోదం తెలిపింది. ఇది ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ.12,053 కోట్లకు అదనంగా ఉంటుంది.
రవాణా, రోడ్లు & భవనాలు
7. రవాణా, రోడ్లు & భవనాలు: న్యూ ఢిల్లీలో 11.536 ఎకరాల ప్రభుత్వ భూమిలో నూతన ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంచనా వ్యయం రూ.124.50 కోట్లు. డిజైన్ మరియు నిర్మాణ పని నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (NBCC)కు అప్పగించడానికి అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా అత్యాదునికి సాకర్యాలతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు.
పురపాలక & పట్టణాభివృద్ధి
8. పురపాలక & పట్టణాభివృద్ధి: నెల్లూరు, కాకినాడ, కర్నూలు మరియు కడప క్లస్టర్లలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు స్థాపించడానికి రూ.25.08 కోట్ల విలువైన ప్రాజెక్టులపై ఇంప్రూవ్మెంట్ చార్జీలపై 2% స్టాంప్ డ్యూటీ మినహాయింపుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
9. పురపాలక & పట్టణాభివృద్ధి: రాష్ట్రంలోని అర్బన్ లోకల్ బాడీలకు చెందిన స్థిర ఆస్తులు మరియు షాపు గదుల లీజు పునరుద్ధరణ మరియు అద్దె నిర్ణయాన్ని సరళీకరించడానికి ‘AP మునిసిపాలిటీస్ (Regulation of Receipts and Expenditure) Rules, 1968’కు సవరణలు చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
10. పురపాలక & పట్టణాభివృద్ధి: రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో (ULBs) మ్యుటేషన్ చార్జీలు ఏకరూపంగా ఉండేందుకు ‘మునిసిపాలిటీస్ యాక్ట్, 1965’ మరియు ‘మునిసిపల్ కార్పొరేషన్స్ యాక్ట్, 1955’ మరియు ‘Alteration of Ownership of Property in Assessment Book Rules, 1966’కు సవరణలు చేసే ముసాయిదా బిల్లుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
11. పురపాలక & పట్టణాభివృద్ధి: అమరావతిలో కృష్ణా నది కుడి గట్టు వరద నిరోధక నిర్మాణం మరియు బలోపేతం చేయడానికి మూడు ప్యాకేజీల (ప్యాకేజ్ XXXVII: రూ.149.82 కోట్లు, ప్యాకేజ్ XXXVIII: రూ.146.47 కోట్లు, ప్యాకేజ్ XXXIX: రూ.146.97 కోట్లు) సవరించిన పరిపాలన ఆమోదం మొత్తం రూ.443.26 కోట్లకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పని పరిధి రిటెయినింగ్ వాల్ నుండి రెండు వైపులా ఎంబ్యాంక్మెంట్కు మారడం వల్ల పూర్వపు పరిపాలన ఆమోదం రూ.1304.89 కోట్లు సవరించబడింది. కొత్త టెండర్లు పిలవడానికి C&MD, ADCL కు అనుమతి ఇచ్చింది.
12. పురపాలక & పట్టణాభివృద్ధి: అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌లో ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రెటేరియట్ & HoD కార్యాలయాలు (GAD టవర్, టవర్లు 3 & 4 మరియు టవర్లు 1 & 2)కు గ్లాస్ క్లాడింగ్, క్రౌన్, అట్రియం, కెనోపీ స్కైలైట్, కాలమ్ క్లాడింగ్, PV ప్యానెల్స్ మరియు BMU పనుల కోసం ‘కంబైన్డ్ పరిపాలన ఆమోదం’ రూ.2,540.00 కోట్లకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ మూడు ప్యాకేజీలకు Design & Build Lumpsum (Percentage Tender) Contract System కింద టెండర్లు పిలవడానికి AGICL MD కు అనుమతి ఇచ్చింది.
13. పురపాలక & పట్టణాభివృద్ధి: అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ ఆఫీస్ టవర్లు (T1 & T2) షెల్ & కోర్ నిర్మాణానికి రూ.1208,41,09,460/- పరిపాలన ఆమోదం ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. Design & Build Lumpsum (Percentage Tender) Contract System కింద టెండర్లు పిలవడానికి AGICL MD కు అనుమతి ఇచ్చింది.
14. పురపాలక & పట్టణాభివృద్ధి: అమరావతి రాజధాని నగరంలో శాసనసభ భవనానికి స్పైర్, పార్కింగ్ రింగ్, రూఫ్ & అప్రోచ్ బ్రిడ్జెస్ ఓవర్ పాలవాగు వంటి సివిల్ స్ట్రక్చర్ పనులకు రూ.798.00 కోట్ల పరిపాలన ఆమోదం ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. Lumpsum (% Tender) Contract System కింద టెండర్లు పిలవడానికి AGICL MD కు అనుమతి ఇచ్చింది.
15. పురపాలక & పట్టణాభివృద్ధి: అమరావతిలో జోన్-11 పరిధిలో ఉండవల్లి గ్రామంలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద లేఔట్లలో రోడ్లు, నీటి కాలువలు, నీటి సరఫరా, మురుగు నీటి వ్యవస్థ, పవర్ & ICT యుటిలిటీ డక్ట్స్, రీయూజ్ వాటర్‌లైన్, STP మరియు అవెన్యూ ప్లాంటేషన్ పనులకు ప్యాకేజ్ XXXXXVIII కింద రూ.580.00 కోట్ల పరిపాలన ఆమోదం ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 2 సంవత్సరాల DLP తో lumpsum (% tender) కాంట్రాక్ట్ పద్ధతిలో టెండర్లు పిలవడానికి C&MD, ADCL కు అనుమతి ఇచ్చింది. APCRDA నిధుల నుండి ఈ పని నిర్వహించబడుతుంది.
16. పురపాలక & పట్టణాభివృద్ధి: CRDA సరిహద్దుల లోపల N10-E1 జంక్షన్ నుండి N13-E1 జంక్షన్ వరకు 220 KV EHV లైన్ల బ్యాలెన్స్ పనులను UG కేబుల్స్ ద్వారా రీరూటింగ్ చేయడానికి సవరించిన అంచనా రూ.1180.54 కోట్లకు పరిపాలన ఆమోదం ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పూర్వపు పరిపాలన ఆమోదం రూ.1082.44 కోట్లు జి.ఓ.ఆర్టీ.నం.197, MA&UD (CRDA) శాఖ, తేదీ:09.03.2025 కు బదులుగా ఇది వచ్చింది.
17. పురపాలక & పట్టణాభివృద్ధి: జి.ఓ.ఎంఎస్.నం.45, MA & UD (CRDA.2) శాఖ, తేదీ:31.03.2023 మరియు జి.ఓ.ఎంఎస్.నం.59, MA & UD (CRDA), తేదీ:09.05.2023 ద్వారా రెవెన్యూ శాఖకు చేసిన భూమి కేటాయింపును APCRDA అథారిటీ మీటింగ్ రెజల్యూషన్ నం.646/2026, తేదీ:23.04.2026 మేరకు రద్దు చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
18. పురపాలక & పట్టణాభివృద్ధి: అమరావతి రాజధాని ప్రాంత ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (Formulation & Implementation) Rules, 2025 — జి.ఓ.ఎంఎస్.నం.118, MA&UD (CRDA) శాఖ, తేదీ:01.07.2025లోని Rule 16(2)(c) మరియు Rule 16(6)(a) మరియు తత్సంబంధిత Form-III మరియు Form-V లలో సవరణలు చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అన్యుయిటీ పెంపు, అప్పు మాఫీ కట్-ఆఫ్ తేదీ సరళీకరణ మరియు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ సమర్థవంతమైన అమలుకు ప్రక్రియపరమైన అంశాలు సుస్పష్టం చేయడం ఈ సవరణ ప్రధాన లక్ష్యం.
19. పురపాలక & పట్టణాభివృద్ధి: CRDA ప్రాంతంలో వివిధ సంస్థలకు భూమి కేటాయింపు కొత్త ప్రతిపాదనలపై మరియు పాత కేటాయింపుల సమీక్ష పై మంత్రుల బృందం 25వ సమావేశం సిఫార్సులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. APCRDA అథారిటీ రెజల్యూషన్ నెం.649/2026, తేదీ:23.04.2026 మేరకు Commissioner, APCRDA అమరావతి ల్యాండ్ అలాట్మెంట్ రూల్స్, 2017 మరియు అమరావతి ల్యాండ్ అలాట్మెంట్ రెగ్యులేషన్స్, 2017 ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది.బ సెబీకి, స్వామినారాయణన్ గురుకుల పాఠశాలకు, డి.ఏ.వి. పబ్లిక్ స్కూలకు మరియు అగ్నిమాప శాఖకు భూముల కేటాయింపు జరిగింది.
జలవనరుల అభివృద్ధి
20. జలవనరుల అభివృద్ధి: పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కారణంగా నిర్వాసితులైన కుటుంబాలలో (Tribals తో పాటు Non-STs) ఒన్ టైమ్ సెటిల్మెంట్ (OTS) ఎంచుకున్న వారికి (a) ఇల్లు నిర్మించడానికి యూనిట్ ధర రూ.2.85 లక్షల నుండి రూ.3.57 లక్షలకు పెంచడానికి మరియు (b) R&R కాలనీ కాకుండా వేరే చోట ఇల్లు నిర్మించుకోవడానికి OTS ఎంచుకున్న వారికి హౌస్ సైట్ విలువ రూ.1.00 లక్ష నుండి రూ.2.00 లక్షలకు పెంచడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ పెంపు Revised Cost Committee ధరల స్థాయి 2022-23 మేరకు ఆమోదించబడింది.
21. జలవనరుల అభివృద్ధి: పోలవరంఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎడమ ప్రధాన కాలువ (Package–1(A))కు చెందిన ఏజెన్సీ M/s Surya Cons Pvt. Ltd., హైదరాబాద్ వారికి, “పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మెయిన్ కాలువలో KM 12.885 వద్ద డ్రెయిన్ సైఫన్ నిర్మాణం మరియు 525 మీటర్ల పొడవు ఎస్కేప్ చానల్ తవ్వకం” పనులను అదనపు పనులుగా అప్పగించుటకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ పనుల అంచనా వ్యయం ECV అంశాలకు రూ.2,76,45,909/- మరియు non-ECV అంశాలకు రూ.4,71,90,753/- కలిపి మొత్తం రూ.7,48,36,662/-గా నిర్ణయించబడింది. పనులు SSR 2004-05 (IBM SSR) రేట్ల ప్రకారం, ఒరిజినల్ ఏజెన్సీ టెండర్ ప్రీమియం (+)0.1416%తో పాటు, G.O.Ms.No.22 & 63 ప్రకారం లభించే ప్రయోజనాల విస్తరణకు అవకాశం కల్పిస్తూ అమలు చేయుటకు ఆమోదం తెలిపింది.
22. జలవనరుల అభివృద్ధి: శ్రీ సత్య సాయి జిల్లాలో హంద్రి నీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ – ఫేజ్-II పరిధిలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌ను Km.26.200 నుండి Km.75.075 వరకు సిమెంట్ కాంక్రీట్ లైనింగ్‌తో ఆధునీకరించే పనికి సవరించిన అంచనా రూ.309,92,90,000/-కు పరిపాలన ఆమోదం ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇంతకు ముందు జి.ఓ.ఆర్టీ.నం.404, WR (Proj.III) శాఖ, తేదీ:03.12.2024 మరియు జి.ఓ.ఆర్టీ.నం.197, WR (MI.G) శాఖ, తేదీ:06.05.2025 ద్వారా మంజూరైన రూ.207,20,00,000/-కు ఈ సవరించిన అంచనా తీసుకొస్తున్నారు. హంద్రి నీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ మొత్తం పొదుపుల నుండి అదనపు మొత్తం సమకూరుతుంది.
రెవెన్యూ శాఖ
23. రెవెన్యూ: తిరుపతి జిల్లా రేణిగుంట (M), కురుకల్వ (V)లో Sy.No.240/1, 241/5, 244/5, 244/66, 2612 మరియు 261/5లో 10.10 ఎకరాలు ప్రభుత్వ భూమిని CEO, Sunrise Educational Initiatives Private Limited కు ఎకరాకు రూ.1,12,50,000/- మార్కెట్ విలువ చొప్పున మొత్తం రూ.11,36,25,000/- చెల్లింపుపై ‘International Sports Centric School’ స్థాపన కోసం కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
24. రెవెన్యూ: YSR కడప జిల్లా C.K.దిన్నె మండలం కొలుముళ్లపల్లి (V)లో Sy.No.871లో 92.00 ఎకరాలు ప్రభుత్వ భూమిని కడప మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు ఆధునిక డంపింగ్ యార్డ్ / ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సౌకర్యం స్థాపన కోసం ఎకరాకు రూ.5,25,000/- చొప్పున మొత్తం రూ.4,83,00,000/- చెల్లింపుపై కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
25. రెవెన్యూ: ప్రకాశం జిల్లా (పూర్వపు SPSR నెల్లూరు జిల్లా) ఉలవపాడు మండలం కారెడు గ్రామంలో Sy.No.395, 402 మొదలైనవాటిలో 22.74 ఎకరాలు ప్రభుత్వ భూమిని APIIC కు ఇండస్ట్రియల్ హబ్ స్థాపన కోసం మార్కెట్ విలువ ఎకరాకు రూ.13,98,842/- చొప్పున మొత్తం రూ.3,18,09,667/- చెల్లింపుపై కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
26. రెవెన్యూ: చిత్తూరు జిల్లా యాదమరి మండలం మాజర కొతపల్లె గ్రామంలో Sy.No.57/1, 57/2, 57/3, 58/1A, 58/1B మరియు 58/2లో 13.71 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు అసెప్టిక్ ప్యాకింగ్ యూనిట్ అప్‌గ్రేడేషన్ మరియు పండ్లు, కూరగాయల నుండి పల్ప్ తీయడానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ఎకరాకు రూ.1,50,000/- భూమి ధర చొప్పున (2007 నాటి విలువ) జి.ఓ.ఎంఎస్.నం.571, Revenue (Assn-I) శాఖ, తేదీ:14.09.2012 ప్రకారం కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
27. రెవెన్యూ: అనంతపురం జిల్లా గొట్టి గ్రామం & మండలంలో Sy.No.642-2 మొదలైనవాటిలో 11.82 ఎకరాలు ప్రభుత్వ భూమిని MIG లేఔట్ల అభివృద్ధి కోసం AHUDA, అనంతపురంకు ఎకరాకు రూ.12,60,000/- మార్కెట్ విలువ చొప్పున కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
28. రెవెన్యూ: కాకినాడ జిల్లా ఏలేశ్వరం (M), J.అన్నవరం (V)లో Sy.No.109/6లో 10.00 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఫిషరీస్ శాఖ కమిషనర్‌కు M/s Fishin India Pvt. Ltd., విశాఖపట్నం కు ఆముఖంగా కేటాయించడానికి ఆమోదం తెలిపింది. ఫిష్ కేజ్ కల్చర్ స్థాపన కోసం మార్కెట్ విలువపై 10% లీజు అద్దె చొప్పున (అంటే ఎకరాకు సంవత్సరానికి రూ.3,50,000/-; మొత్తం భూమి ధర: 10.00 సెంట్లకు రూ.35,00,000/-) 33 సంవత్సరాల లీజు పద్ధతిలో, ప్రతి 5 సంవత్సరాల బ్లాక్‌కు 10% పెంపుతో కేటాయించబడుతుంది.
29. రెవెన్యూ: కాకినాడ జిల్లా అర్బన్ మండలం లో వార్డ్ నం.3, బ్లాక్ నం.3, T.S.No.62/1A2లో 2762.73 చదరపు గజాల (0.57 సెంట్లు) ప్రభుత్వ భూమిని జ్యుడీషియల్ అధికారులకు నివాస క్వార్టర్లు (1635 చదరపు గజాలు), POSCO కోర్టు (816 చదరపు గజాలు) నిర్మాణం కోసం మరియు న్యాయ శాఖ భవిష్యత్ అవసరాలకు (311.73 చదరపు గజాలు) జ్యుడీషియల్ శాఖకు ఉచితంగా బదిలీ చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
30. రెవెన్యూ: విజయనగరం జిల్లా విజయనగరం మండలం కనపాక అయ్యన్నపేట (V)లో Sy.No.94/2లో 2.00 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, విజయనగరంకు TDP జిల్లా కార్యాలయ భవనం నిర్మాణం కోసం 33 సంవత్సరాల లీజు పద్ధతిలో ఎకరాకు సంవత్సరానికి రూ.1,000/- చొప్పున జి.ఓ.ఎంఎస్.నం.340, Revenue (Assn.I) శాఖ, తేదీ:21.07.2016 మేరకు కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
31. రెవెన్యూ: ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కొత మామిడిపాలెం గ్రామంలో Sy.No.82/1B2Bలో 2.00 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షుడుకు ఒంగోలులో TDP జిల్లా కార్యాలయ భవనం నిర్మాణం కోసం 33 సంవత్సరాల లీజు పద్ధతిలో ఎకరాకు సంవత్సరానికి రూ.1,000/- చొప్పున జి.ఓ.ఎంఎస్.నం.340, Revenue (Assn.I) శాఖ, తేదీ:21.07.2016 మేరకు కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
32. రెవెన్యూ: కృష్ణా జిల్లా మచిలీపట్నం టౌన్ & నార్త్ మండలంలో R.S.No.371-A1B1లో 1.50 ఎకరాల ప్రభుత్వ భూమిని చైర్మన్, డా. భోగరాజు పట్టాభి సీతారమయ్య మెమోరియల్ ట్రస్ట్, మచిలీపట్నంకు ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకుడైన డా. భోగరాజు పట్టాభి సీతారమయ్య స్మారక భవనం నిర్మాణం మరియు సంక్షేమ, దాతృత్వ కార్యకలాపాల నిర్వహణ కోసం మొత్తం భూమి విలువ రూ.37,56,75,960/- చెల్లింపుపై కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మునిసిపల్ రెజల్యూషన్ సమర్పించడం మరియు BSO-24 కింద మామూలు షరతులకు లోబడి ఈ కేటాయింపు జరుగుతుంది.
33. రెవెన్యూ: కర్నూలు జిల్లా కుర్నూలు మండలం కళ్ళూరు గ్రామంలో Sy.No.743/A1లో 1.50 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, కర్నూలుకు TDP జిల్లా కార్యాలయ భవనం నిర్మాణం కోసం 33 సంవత్సరాల లీజు పద్ధతిలో ఎకరాకు సంవత్సరానికి రూ.1,000/- చొప్పున జి.ఓ.ఎంఎస్.నం.340, Revenue (Assn.I) శాఖ, తేదీ:21.07.2016 మేరకు కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. APLMA తేదీ:05.01.2026 ప్రతిపాదన విత్‌డ్రా చేయడం జరిగింది.
34. రెవెన్యూ: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ & మండలంలో Sy.No.316-2లో 2.00 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షునికి TDP జిల్లా కార్యాలయ భవనం నిర్మాణం కోసం 33 సంవత్సరాల లీజు పద్ధతిలో ఎకరాకు సంవత్సరానికి రూ.1,000/- చొప్పున కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
35. రెవెన్యూ: ఏలూరు జిల్లా మరియు ఏలూరు మండలం టౌన్ లో T.S.No.660/3లో 1.61 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షునికి TDP జిల్లా కార్యాలయ భవనం నిర్మాణం కోసం 33 సంవత్సరాల లీజు పద్ధతిలో ఎకరాకు సంవత్సరానికి రూ.1,000/- చొప్పున కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
36.రెవెన్యూ: పార్వతీపురం జిల్లా మరియు పార్వతీపురం మండలం సుందరనారాయణపురం (V)లో Sy.No.619-1లో 2.00 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షునికి TDP జిల్లా కార్యాలయ భవనం నిర్మాణం కోసం 33 సంవత్సరాల లీజు పద్ధతిలో ఎకరాకు సంవత్సరానికి రూ.1,000/- చొప్పున కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
పరిశ్రమలు & వాణిజ్యం
37.పరిశ్రమలు & వాణిజ్యం: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కేంద్ర ప్రభుత్వ సంస్థ DRDO ఆధ్వర్యంలో చేపడుతున్న డిఫెన్సు పరిశ్రమ కోసం దాదాపు 600 ఎకరాల భూమి కేటాయింపుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
38. పరిశ్రమలు & వాణిజ్యం: కొప్పర్తి పనులు మరియు APIIC లిమిటెడ్ చేపడుతున్న ఇతర నీటి సరఫరా పనులకు సంబంధించిన సవరించిన అంచనాల ప్రకారం అంతర్గత వ్యయాల నిమిత్తం, APIIC యొక్క VC & MD బ్యాంకులు/ఆర్థిక సంస్థల నుండి రూ.75 కోట్లు రుణం పొందేందుకు ఇచ్చిన అనుమతిపై చేపట్టిన చర్యను ఆమోదించడం (ratification)తో పాటు, ఆ రుణాన్ని వడ్డీతో సహా సంబంధిత ఆర్థిక సంస్థలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (GOAP) ద్వారా తిరిగి చెల్లించే ఏర్పాట్లు చేయుటకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
పరిశ్రమలు & మౌలిక సదుపాయాలు (పోర్టులు)
39. పరిశ్రమలు & మౌలిక సదుపాయాలు (పోర్టులు): శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, అనకాపల్లి జిల్లాలోని పుడిమడక మరియు ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నంలో మూడు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి సవరించిన పరిపాలనా ఆమోదం మొత్తం రూ.1586.69 కోట్లకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మొదట జి.ఓ.ఎంఎస్.నం.11, I&I (Ports) శాఖ, తేదీ:19.08.2021 ద్వారా రూ.1150.79 కోట్లకు పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్టుల ద్వారా మత్స్యకారులకు ఆధునిక ల్యాండింగ్, బెర్తింగ్ సౌకర్యాలు లభించడంతో పాటు చేపల ఉత్పత్తి మెరుగుపడుతుంది. దాదాపు 12,700 మందికి పైగా మత్స్యకారులకు జీవనోపాధి అవకాశాలు లభిస్తాయి మరియు ఈ హార్బర్లు సుమారు 2,530 ఫిషింగ్ నౌకలకు మద్దతు ఇస్తాయి. వీటిలో అదనంగా పుడిమడక ఫిషింగ్ హార్బర్‌ను సమీప పారిశ్రామిక క్లస్టర్లకు ఉపయోగపడేలా కార్గో హ్యాండ్లింగ్ సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నారు. దీనివల్ల తీరప్రాంత లాజిస్టిక్స్ మెరుగుపడటమే కాకుండా ప్రధాన పోర్టులపై ఆధారపడటం మరియు రోడ్ల రద్దీ తగ్గుతాయి. మొత్తంగా ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర ఆర్థిక వృద్ధి వేగవంతం అవ్వడంతో పాటు, మత్స్య రంగ మౌలిక సదుపాయాల బలోపేతం మరియు సమగ్ర తీరప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుంది.
వ్యవసాయం & సహకారం
40. వ్యవసాయం & సహకారం: 2024-25లో ఏర్పాటు చేసిన ఏజెన్సీలతో కిసాన్ డ్రోన్లతో కూడిన విలేజ్-లెవల్ ఫార్మ్ మెషినరీ బ్యాంకులను 2025-26కు కూడా అదే నిబంధనలు, సాంకేతిక వివరాలు మరియు 2024-25కు వర్తించే షరతులతో కొనసాగించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 2025-26కు నిధులు కేటాయించడానికి అనుమతి ఇస్తూ, “భారత ప్రభుత్వం వద్ద లాప్స్ అయిన నిధులను తిరిగి పొందేందుకు అవసరమైన చర్యలు చేపట్టుటకు” శాఖకు అనుమతి ఇచ్చింది.
ఇంధన శాఖ
41. ఇంధన శాఖ: APPCC/DISCOMs కు M/s REC నుండి తీసుకున్న MTL రుణాలు రూ.7000 కోట్లకు కొన్ని షరతులతో ప్రభుత్వ హామీ పొడిగింపుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్.విశ్వనాథన్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News