విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎగ్జిబిషన్లో అగ్నిమాపక చర్యలను తప్పకుండా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్ అన్నారు. ఆదివారము ఉదయం సితార సెంటర్, పున్నమి ఘాట్ భవానిపురం ప్రాంతాలలో ఉన్న ఎగ్జిబిషన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్ మాట్లాడుతూ ఎగ్జిబిషన్ నిర్వహణలో అగ్నిమాపక చర్యలు కచ్చితంగా పాటించాలని ఎటువంటి అగ్నిప్రమాదం జరగకుండా ప్రతిచోట ప్రతిష్టాల్లో కచ్చితంగా నివారణ చర్యలు పాటించాలని ప్రతిష్టాలు పైన అత్యవసర నంబర్లను సూచించాలని, ఎగ్జిబిషన్ ప్రాంగణంలో అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే దారిను సూచించే సూచనలను ఏర్పాటు చేయడమే కాకుండా ఎల్లప్పుడూ బయటకు వెళ్లే మార్గంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలని అన్నారు.
ఎగ్జిబిషన్ స్టాల్స్ లోపల వంట వండేందుకు ఎటువంటి వంట పరికరాలు కానీ మంట పరికరాలు కానీ ఉంచరాదని, అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు పాటించే ప్రాంతంలో మాత్రమే ఒక కామన్ కిచెన్ ఏర్పాటు చేసుకుని వంట వండే ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు అధికారులు సూచించారు. సురక్షితంగా లేని మరియు లూస్ గా ఉన్న ప్రమాదకరమైన విద్యుత్ వైర్లను వెంటనే తొలగించాలని, ఎగ్జిబిషన్లో ఉన్న వివిధ స్టాల్స్ లో ఉండేవారికి తరచూ అగ్నిమాపక చర్యలు పై మోక్ డ్రిల్ ను నిర్వహిస్తూ ఎటువంటి ప్రమాదం సంభవించకుండా చర్యలు తీసుకోవాలని ఎగ్జిబిషన్ నిర్వాహకులకు అధికారులు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ నగర పాలక సంస్థ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్ తో పాటు కొత్తపేట స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News