Breaking News

ఆప్ సబ్కీ ఆవాజ్ సంక్షేమ సంస్థ హెల్మెట్ల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి అంకితం అవుతూ ఆప్ సబ్కీ ఆవాజ్ సంక్షేమ సంస్థ అర్థవంతమైన ప్రజాసేవా కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్లోని వివిధ వర్గాలపైన శాశ్వతమైన ప్రభావాన్ని చూపుతోందని ఆవాజ్ సంస్థ అధ్యక్షులు వడ్లమూడి శివకుమార్ తెలిపారు. సోమవారం ప్రెస్ క్లబ్ లో జరిగిన హెల్మెట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కుల, మత, జాతి భేదం లేకుండా ప్రతి పౌరుడు గొంతుకగా నిలిచి సమాజంలోని ప్రతి మూలకు సేవ చేయడం, నిజమైన మార్పు క్షేత్రస్థాయిలో జరుగుతుందనే నమ్మకంతో ఆప్ సబ్కీ ఆవాజ్ సంస్థ స్థాపించామని తెలిపారు. ప్రజారోగ్యం, రహదారి భద్రత, పౌర సంక్షేమం, సామాజిక అభివృద్ధికి కట్టుబడి ఉన్న ఒక సామాజిక సంక్షేమ సంస్థ ఆంధ్రప్రదేశ్ అంతటా చురుకుగా పనిచేస్తుందన్నారు. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నంలో బలమైన ఉనికి కలిగి ఉందన్నారు. గత సంవత్సరం అక్టోబర్లో ఈ సంస్థ విజయవాడలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ల పంపిణీ చేపట్టింది. హెల్మెట్లు ధరించడం, బాధ్యతాయుతమైన రోడ్డు ప్రమాదాలు గురించి అవగాహన కల్పించిందన్నారు.

సంస్థ సలహాదారు మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టులు నిర్వహిస్తున్న పాత్ర అమోఘమని, వారి వృత్తి ధర్మంలో భాగంగా రోడ్డుపైనే వాహనాలు నడిపే క్రమంలో ఒక్కోసారి రోడ్డు ప్రమాదాలకు గురవుతారని అన్నారు. రోజులకు 1400 రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటే అందులో నగం మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని చెప్పారు. అందువలన ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించి ప్రాణాపాయం నుంచి బయట పడాలని సూచించారు. అదే విధంగా తమకు గుంటూరులో ఆసుపత్రి ఉందన్నారు. ఒ.పి సేవలు అన్ని ఉచితంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. హాస్పిటల్కు సంబంధించిన ఉచిత కూపన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆప్ సబ్కీ ఆవాజ్ సంక్షేమ సంస్థ సభ్యులు, ఐజెయు కౌన్సిల్ సభ్యులు ఎస్.కె.బాబు, ఏ.పి.డబ్ల్యుజె ప్రధాన కార్యదర్శి కె. జయరాజ్, ఉపాధ్యక్షులు చావా రవి, సామ్నా ప్రధాన కార్యదర్శి సి. హెచ్ రమణారెడ్డి, ఆవాజ్ సంస్థ కార్యదర్శి బి. కిరణ్ కుమార్, కృష్ణాజిల్లా ఇన్ఛార్జి కె.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *