-నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ తో కీలక అవగాహన ఒప్పందం
-ఏడాదిలోనే 2000 మందికి ఉపాధి
-పరిశ్రమల స్థాపన మార్కెటింగ్ రంగాలలోనూ పూర్తి సహకారం
-విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఎస్సీ యువతకు ఎంపీ కేశినేని చిన్ని శుభవార్త చెప్పారు. జిల్లా కలెక్టర్ సమక్షంలో నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ జరిగిందని ప్రతి ఒక్క ఎస్సి కుటుంబం నుంచి నుండి ఒక నూతన పారిశ్రామికవేత్త రావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న నిరుద్యోగ ఎస్సీ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు తానెల్లప్పుడు ముందే ఉంటానని ఎంపీ చిన్ని పేర్కొన్నారు. ఎస్సీ యువత ఆర్థికంగా అభివృద్ధి సాధించి పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయని ఎంపీ వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆకాంక్ష ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలని లక్ష్యంతో నే తాను కూడా నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులతో చర్చలు జరిపి విజయవాడకు తీసుకువచ్చినట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ సమక్షంలో నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ తో అవగాహన ఒప్పందం కుదిరిందని స్వయంగా ఎంపీ నే స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఎస్సీ యువత వ్యాపారానికి కావలసిన ఆర్థిక సహకారంతో పాటు మార్కెటింగ్ రంగంలో కూడా పూర్తి సహాయం అందిస్తామని ఎంపీ తెలియజేశారు. సుమారు 2000 మంది యువత ను ఎంపిక చేసి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కార్పొరేషన్ అంగీకారం తెలిపినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏ కుటుంబానికి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని ఎంపీ చిన్ని తెలిపారు.
Prajavartha Online Telugu News