గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (యునిడో) గుంటూరు నగర అభివృద్ధికి మరింత సహకారం అందించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ కోరారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో యునిడో ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ యునిడో సహకారంతో గుంటూరు నగరపాలక సంస్థ సంగం జాగర్లమూడి సమ్మర్ స్ట్రోరేజ్ ట్యాంక్ లో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే ఈ-ఆటోలను కూడా అందించారని, మహిళలను భాగస్వామ్యం చేయడం, ఎలక్ట్రికల్ ఆటోల ద్వారా కాలుష్య రహిత చెత్త సేకరణ చేయడంపై అంతర్జాతీయ స్థాయిలో అవార్డ్ కూడా జిఎంసికి దక్కిందన్నారు. ఇదే విధంగా రానున్న కాలంలో కూడా యునిడో గుంటూరు నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు. సమావేశంలో ఈఈ సుందర్రామిరెడ్డి, యునిడో నుండి దీపికా శ్రీపాద్ లేలే, నంద్ పాల్ సింగ్, గౌరవ్ వర్మ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News