మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
టీమ్ వర్క్‌తోనే అభివృద్ధి జరుగుతుందని… నేను అని కాకుండా.. మనం అనే ఆలోచన విధానం అందరిలో రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.గురువారం రాష్ట్ర రాజధాని అమరావతి లోని రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, రాష్ట్ర మంత్రులు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, అధిపతులతో కలిసి 7 వ కలెక్టర్ల సమావేశం నిర్వహించి జి ఎస్ డి పి గ్రోత్ , సింగపూర్ దేశంలో మంత్రులకు శిక్షణ, స్వర్ణాంధ్ర @ 2047- 10 సూత్రాలు, వైద్య ఆరోగ్యం, జలధార వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిపి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నేర్చుకోవటం అనేది నిరంతర ప్రక్రియ అని, అత్యుత్తమ విధానాలు ఎక్కడున్నా అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. సింగపూర్ దేశంలో అనుసరిస్తున్న పాలనా విధానాలు అక్కడి ప్రజల విశ్వాసాన్ని దక్కించుకున్నాయన్నారు.. సింగపూర్ అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను తీసుకుని ఓ జిల్లాను మోడల్ గా అభివృద్ధి చేద్దామన్నారు.
సింగపూర్ విధానాల అమలుకు 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి పర్యవేక్షణ చేపట్టాలన్నారు. సింగపూర్ దేశంలో నేను కాదు.. మనం అనే విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కూడా నేను కాదు. మనం అనే విధానాన్నే అవలంభిద్దామన్నారు.. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినా… సంక్షేమ, అభివృద్ధి జరగుతున్నా.. అందరి కృషి వల్లే సాధ్యమైందనీ. కలిసి కట్టుగా పని చేస్తే… ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సొంతం చేసుకుంటే ప్రభుత్వం మరింత విజయవంతంగా సేవలు అందించగలదన్నారు. నేను కాదు మనం అనే విధానాన్ని తనతో ప్రారంభిస్తున్నానని. ప్రతి ఒక్కరూ ఇదే తరహాలో ఆలోచన చేయాలన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి అనే మూడు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. అభివృద్ధి లేకుండా సంపద లేదని సంపద లేకుండా సంక్షేమం లేదని స్పష్టం చేశారు.
మంగినపూడి, సూర్యలంక, విశాఖ, శ్రీకాకుళం, మైపాడు తదితర ప్రాంతాల్లో బీచ్ ఫ్రంట్లు అభివృద్ధి చేస్తే స్థానికులకు అవకాశాలు పెరుగుతాయన్నారు.
కొత్త జాతీయ రహదారులు కొత్త అవకాశాల్ని సృష్టిస్తాయన్నారు…. లాజిస్టిక్స్ హబ్ లను ఏర్పాటు చేసుకోవచ్చనీ… టౌన్ షిప్ లను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.
విజన్ యూనిట్లను జిల్లా కలెక్టర్లు సమర్ధంగా వినియోగించుకోవాలన్నారు. . గతంతో పోల్చుకుంటే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందన్నారు. గతానికంటే మెరుగైన పనితీరు కనబర్చడానికి… అభివృద్ధి చేయడానికి, సంక్షేమం అందించడానికి ఇప్పుడు కలెక్టర్లకు అవకాశాలు ఎక్కువన్నారు.
మార్చి2027 నాటికల్లా రెవెన్యూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన కావాలన్నారు.
సమస్య పరిష్కారం కోసం వినూత్నంగా ఆలోచనలు చేస్తే సుపరిపాలన అందించినట్టేనన్నారు.
ఈ వీడియో సమావేశంలో నగరంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి డిఆర్ఓ చంద్రశేఖర రావు, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు కలెక్టరేట్ డిప్యూటీ కలెక్టర్ నారాయణ, డ్వామా పిడి శివప్రసాద్, డిపిఓ ధనలక్ష్మి ,మత్స్యశాఖ జెడి అయ్యా నాగరాజా, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, పశుసంవర్ధకశాఖ అధికారి చిన్న నరసింహులు, డిఎంహెచ్వో డాక్టర్ యుగంధర్, డి పి టి ఓ వెంకటేశ్వర్లు, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి వెంకటరావు, జి జి హెచ్ పర్యవేక్షకులు డాక్టర్ లీలా ప్రసాద్, భూగర్భ జలశాఖ ఏడి బిందుశ్రీ, రహదారులు భవనాల శాఖ ఈ ఈ లోకేష్, ఎం.వి.ఐ శ్రీనివాసరావు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News