Breaking News

పెండింగ్ సమస్యల తక్షణ పరిష్కారానికే ప్రభుత్వం ప్రాధాన్యం

– కుంటముక్కల గ్రామంలో “ఒక నెల – ఒక గ్రామం” కార్యక్రమం
– అడిష‌న‌ల్ సీసీఎల్ఏ జె.వెంక‌ట‌ముర‌ళి, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తోందని అడిషనల్ సీసీఎల్ఏ జె.వెంక‌ట‌ముర‌ళి, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ అన్నారు.
గురువారం జి.కొండూరు మండ‌లం, కుంటముక్కల గ్రామంలో నిర్వహించిన “ఒక నెల – ఒక గ్రామం నాలుగు పర్యటనలు” కార్యక్రమానికి వెంక‌ట ముర‌ళి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రెవెన్యూ సంబంధిత భూవివాదాల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న పెండింగ్ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతోందని ఆయన వివరించారు. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇల‌క్కియ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను గుర్తించి, తక్షణమే పరిష్కరించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విజ‌య‌వాడ ఆర్‌డీవో వెన్నెల శ్రీను, జి. కొండూరు మండల ఇన్చార్జి తహసిల్దార్ విజయ్ కుమార్, ఎంపీడీవో బి.వి.రామకృష్ణ నాయక్, ఆర్‌ఐ మహేందర్ సింగ్, ఏవో సూరిబాబు, పీఆర్ ఏఈ సాంబశివరావు, పిఎసిఎస్ అధ్యక్షుడు సుఖవాసి శ్రీహరి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గ్రామస్థులు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేయడంతో కార్యక్రమం సజావుగా సాగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *