Breaking News

గొల్లపూడి వన్ సెంటర్‌లో కేడీసీసీ బ్యాంక్⁠ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మైలవరం నియోజకవర్గం గొల్లపూడి వన్ సెంటర్‌లో కేడీసీసీ బ్యాంక్ (కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గొల్లపూడి పీఏసీఎస్ చైర్మన్ నూతలపాటి శ్రీనివాసరావు, గొల్లపూడి మార్కెట్ చైర్మన్ నర్రా వాసు మరియు సీనియర్ నాయకులతో కలిసి ప్రారంభించారు. మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ఆదేశాల మేరకు ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బాటసారులు, కార్మికులు మరియు ప్రజలకు చల్లని తాగునీరు అందించాలనే లక్ష్యంతో కేడీసీసీ బ్యాంక్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాయని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతతో ప్రజలకు అండగా నిలుస్తూ, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇలాంటి ప్రజోపయోగ కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగుతాయని నాయకులు తెలిపారు. ప్రజా సేవే లక్ష్యంగా కేడీసీసీ బ్యాంక్ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బొమ్మసాని సుబ్బారావు, పైడూరుపాడు దాసన్న నాగవర్ధన్ రావు, నూతలపాటి వెంకటేశ్వరరావు, వడ్లమూడి జగన్ మోహన్ రావు, బొర్రా తిరుపతిరావు, భవానిపురం మేనేజర్ బొబ్బా వీణ పాల్గొన్నారు. అలాగే బ్యాంకు సిబ్బంది, సహకార సంఘాల ప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *