విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో మాజీ సైనికులకు సరిఅయిన న్యాయం జరగడంలేదని ఐఈ జేఏసీ నేషనల్ కమిటీ అధ్యక్షులు మోటూరి శంకరరావు విమర్శించారు. తమ హక్కులు తమకు కల్పించాలంటూ ఎపీకి చెందిన మాజీ సైనికులు ‘మాజీ సైనికుల సంక్షేమ సమితి ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో శనివారం, ఆదివారాలు (నవంబర్ 13, 14లు) రెండు రోజులపాటు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఐఈ జేఏసీ నేషనల్ కమిటీ అధ్యక్షులు మోటూరి శంకరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో మాజీ సైనికులకు సరిఅయిన న్యాయం జరగడంలేదన్నారు. జీవో నెంబర్ 57 అమలు చేయాలని డిమాండ్‌చేశారు. భారత సైనికుల హక్కులను అమలుచేయాలన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మాజీ సైనికుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నామని కానీ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ సమస్యలు పరిష్కరించటం లేదని ఆవేదనవ్యక్తం చేశారు. మాజీ సైనికులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. మాజీ సైనికులకు పెన్షన్‌తో సంబంధం లేకుండా తెల్లరేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు. ప్రతి జిల్లాలోనూ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ కాంప్లెక్స్‌లను నిర్మించాలన్నారు. తమ హక్కులకోసం పోరాటం కొనసాగిస్తామని వెల్లడిరచారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాజీ సైనికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. సరిహద్దులలో దేశాన్ని రక్షిస్తూ కాపలాకాస్తూ, శాంతి స్థాపనకు, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజా క్షేమం కోసం భార్య, పిల్ల, తల్లిదండ్రులను విడిచిపెట్టి దేశం కోసం ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ దళాలు కష్టపడుతున్నాయన్నారు. అలా విధులు నిర్వహిస్తూ కొంతకాలానికి పదవి విరామం చేసిన తరువాత చాలా మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. కాబట్టి అటువంటి మమ్మల్ని ప్రభుత్వాలు మా హక్కులు మాకు కల్పించి ఆదుకోవాలని కోరారు.
Tags vijayawada
Check Also
పోషన్ ప్లస్ కార్యక్రమం ద్వారా అవగాహాన కల్పించడం ముఖ్య ఉద్దేశ్యం
-అదనపు పోషక ఆహారం గా మునగాకు పొడి -జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి.. నిత్య ఆహారంలో పోషక విలువలు …