రాష్ట్ర స్థాయి జిల్లాల నుండి “లిడ్ క్యాప్” ను రక్షించండి… :  దైవ వర ప్రసాద్


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లిడ్ క్యాప్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వ్యవస్థాపక కన్వీనర్ ముప్పిడి. దైవ వర ప్రసాద్ మాట్లాడుతూ అన్ని జిల్లాల “లిడ్ క్యాప్” ని రక్షించమని ఆయన అన్నారు. రాష్ట్ర చర్మకార సేవాసంఘాలు, మాదిగ కుల సంఘాలు, మాదిగ మేదావులు‌, చర్మకార నిపుణులతో కూడిన మాదిగ జాతి పెద్దలచే మా గోడు ప్రభుత్వానికి వినిపించడానికి ఈ రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. తదనంతరం లిడ్ క్యాప్ కు కేంద్ర నిధులు కేటాయించాలని, లిడ్ క్యాప్ లో ఉద్యోగుల నియామకాలు కల్పించాలని, తోలు ఉత్పత్తులు సొంతంగా చేయాలని, లిడ్ క్యాప్ ఆస్థులనూ కబ్జాదారుల నుండి కాపాడాలని రోడ్డు ప్రక్కన చెప్పులు కుట్టేవారికి షాపులు కేటాయించాలని వర ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న “లిడ్ క్యాప్” ఛైర్మన్ కాకుమాను రాజశేఖర్ మాట్లాడుతూ “లిడ్ క్యాప్” రీజనల్ ఆఫీస్ లో భవనం నిర్మించడానికి కేంద్రం నుండి 8కోట్లు , రాష్ట్రం నుండి 2 కోట్లు నిధులు వచ్చేలా కృషి చేశానని, ఆంధ్రప్రదేశ్ లో లిడ్ క్యాప్ పరిశ్రమ కు శాశ్వత భూమి ని కేటాయించామని , త్వరలోనే ఉద్యోగ నియామకాలు చేపడతామని ఆయన అన్నారు. లిడ్ క్యాప్ సమస్యలను పరిష్కరించేలా ఒక ప్రణాళికను రుపోందించి వాటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళితే వెంటనే ఆయన సానుకూలంగా స్పందించి ఆమోదించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ బుల్లా రాజారావు, ప్రెసిడెంట్ కాపవరపు కుమార్, దున్నా నాగయ్య, గార్లపాటి దాసూ, పరిరక్షణ సమితి ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *