Breaking News

నేటితో ముగిసిన ‘మాజీ సైనికుల సంక్షేమ సమితి ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ రిలే నిరాహారదీక్షలు…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎపీకి చెందిన మాజీ సైనికులు తమ హక్కులు తమకు కల్పించాలంటూ ‘మాజీ సైనికుల సంక్షేమ సమితి ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో రెండు రోజుల నుంచి నిర్వహించిన రిలే నిరాహారదీక్షలు ముగిసాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ మాజీ సైనికుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఉడిముడి రాజు మాట్లాడుతూ జీవో నెంబర్‌ 57 అమలు చేయాలని డిమాండ్‌చేశారు. భారత సైనికుల హక్కులను అమలుచేయాలన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మాజీ సైనికుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నామని కానీ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ సమస్యలు పరిష్కరించటం లేదని ఆవేదనవ్యక్తం చేశారు. మాజీ సైనికులకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. మాజీ సైనికులకు పెన్షన్‌తో సంబంధం లేకుండా తెల్లరేషన్‌ కార్డులు మంజూరు చేయాలన్నారు. ప్రతి జిల్లాలోనూ ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ కాంప్లెక్స్‌లను నిర్మించాలన్నారు. తమ హక్కులకోసం పోరాటం కొనసాగిస్తామని వెల్లడిరచారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాజీ సైనికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. సరిహద్దులలో దేశాన్ని రక్షిస్తూ కాపలాకాస్తూ, శాంతి స్థాపనకు, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజా క్షేమం కోసం భార్య, పిల్ల, తల్లిదండ్రులను విడిచిపెట్టి దేశం కోసం ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, నేవీ దళాలు కష్టపడుతున్నాయన్నారు. అలా విధులు నిర్వహిస్తూ కొంతకాలానికి పదవి విరామం చేసిన తరువాత చాలా మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. కాబట్టి అటువంటి మమ్మల్ని ప్రభుత్వాలు మా హక్కులు మాకు కల్పించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *