విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
*రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం తూర్పు నియోజవర్గ పరిధి లోని 18వ డివిజన్ కార్పొరేటర్,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో 18వ డివిజన్ వైస్సార్సీపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో మరియు డివిజన్ పర్యటన కార్యక్రమంలో అవినాష్ పాల్గొని ఇంటి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 17,18 డివిజిన్ల మొదటి నుండి కూడా వైసీపీ పార్టీకి బలమైన నాయకత్వం కలిగి ఉన్నదని అందుకే గత టీడీపీ ప్రభుత్వం లో ఈ డివిజిన్లో అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశారని కానీ వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు,కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని, అదేవిధంగా రిటైనింగ్ వాల్ నిర్మాణనికి 125 కోట్ల రూపాయలు మంజూరు చేసారని తెలిపారు. మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆ నమ్మకం తోనే మా పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. తదనంతరం బచ్చు మురళి కృష్ణ, బచ్చు మాదవిగార్ల కుమారుడు విశాఖపట్నంలో జరిగిన అంతర్ రాష్ట్ర స్కెటింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ విజేత వరుణ్ కృష్ణ ని అభినందించిన తూర్పు నియోజకవర్గ ఇన్ చార్జ్ శ్రీ దేవినేనిఅవినాష్ గారు. అనంతరం ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారి తో కలిసి బచ్చు వరుణ్ కృష్ణని సన్మానించడం జరిగింది. త్వరలో చండీగఢ్ లో జరగనున్న జాతీయ స్థాయి ఫోటీల్లో కూడా విజయం సాదించాలి అని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ తంగిరాల రామిరెడ్డి మరియు డివిజన్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …