Breaking News

ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తులు అందచేసిన ఆర్టీసి జేఏసి నాయకులు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గత రెండునెలలుగ శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలపై ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేని కారణంగా ప్రస్తుతం మూడవ దశలో చేపడుతున్న ఉద్యమాలకు, భవిష్యత్ ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని ఏపిపిటిడి (ఆర్టీసి)ఉద్యోగసంఘాలు జేఏసి రాష్ట్ర నాయకత్వం విజ్ఞప్తి చేస్తూ ఆదివారం ఏపి యన్జీవో హోమ్ లో APNGGO రాష్ట్ర అధ్యక్షులు & ఏపిజేఏసి చైర్మన్ ఏ.విధ్యాసాగర్ ని, ను, ప్రధానకార్యదర్శి ఏ.వి.రమణ ని కలసి మద్దతుకోరారు.

ఈసందర్బంగా మిడియాతో మాట్లాడిన ఏపిజేఏసి చైర్మన్ ఏ.విధ్యాసాగర్ ప్రభుత్వం విద్యుత్ బస్సులను ఆర్టీసిలో ప్రవేశ పెట్టడాన్ని ఆర్టీసి ఉద్యోగసంఘాలు స్వాగతిస్తున్నాయని,కాని ఈబస్సులు అన్ని ప్రభుత్వం కొనుగోలుచేసి ఆర్టీసి సిబ్బందితో నిర్వహించి,ఖాళీలు బర్తికి కి నోటీఫికేషన్ విడుదలచేసి ఆర్టిసీ ప్రెవేటీకరణ కావడంలేదన్న భరోసాను ఆర్టిసి ఉద్యోగులకు కల్పించాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ఆర్టీసి జేఏసి చేపట్టబోయే ఉద్యమాలకు, భవిష్యత్ చెపట్టబోవు కార్యక్రమాలకు కూడా సంపుర్ణ మద్దతూ తెలియజేస్తున్నామని విధ్యాసాగర్ రావు తెలిపారు.

విద్యార్ది, యువజన సంఘాలు మద్దతు కోరిన జేఏసి నాయకులు

ఉద్యమానికి మద్దతుకోరే కార్యక్రమంలో భాగంగా ఆదివారం సిపిఐ ఆఫీసు దాసరి భవన్ ఏ ఐ యస్ యఫ్ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జల వలరాజు, ఎఐవైయఫ్ రాష్ట్ర కార్యదర్శి మొజ్జాడ యుగందర్ లను కలసి ఆర్టీసి ఉద్యోగ సంఘాలు గా ఈనెల 17/18 న రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాలలో 129 డిపోలలో చేపడుతున్న రెండురోజు సామూహిక నిరాహారదీక్షలకు, అలాగే ఈనెల 28 న అన్ని జిల్లాకేంధ్రాలలో ప్రజా రవాణా అధికారి (డిపిటిఓ) కార్యాలయాలవద్ద జరగబోవు మహాధర్నాలకు మద్దతు ప్రకటించాలని కోరగా ఆర్టీసి లో స్త్రీశక్తి పెట్టేక బస్సులు చాలక విద్యార్దులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆర్టీసిలో బస్సులు సంఖ్యపెంచి, యువతకు ఉద్యోగ అవకాశలు ఇచ్చేలా ఖాళీలను భర్తిచేయాలని డిమాండ్ చేస్తు ఆర్టీసి జేఏసి ఉద్యమానికి సంపూర్ణమద్దతు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసి జేఏసి కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు, కో-కన్వీనర్లు పి.వి.రమణారెడ్డి, సి.హెచ్.సుందరయ్య, యస్.వి.శేషగిరిరావు, వై.శ్రీనివవాసరావు తో పాటు జెఏసి నాయకులు యం.డి ప్రసాద్, ఆర్.సుబ్భారావు, ఎస్ రాజేష్ కుమార్, యం.శంకరరావు తధితరులు పాల్గోన్నారు. సోమవారం కూడా ఆర్టీసిలో ఉన్న సంఘాలను,ఇతర ట్రేడ్ యూనియన్ నాయకులు,విద్యార్ది సంఘాలను కలుస్తామని ఆర్టీసి జెఏసి నాయకులు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గిరిజనుల ఆత్మగౌరవం, అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

-గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *