అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో బోనాల సంబర మహోత్సవం సందర్భంగా శ్రీ అమ్మవారు పూలంగి సేవలో దర్శనమిచ్చారు. ఆషాడమాసం నాల్గవ ఆదివారం కంఠంరాజు కొండూరు గ్రామం, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా లో కొలువై ఉన్న ప్రసిద్ధ అధ్యాత్మిక పుణ్యక్షేత్రం శ్రీ మహంకాళి అమ్మవారు ఆషాడ మాస ఉత్సవాల సందర్భంగా శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు పూలంగి సేవలో దర్శనమిచ్చారు. బోనాల సంబర మహోత్సవం అంగరంగ వైభవంగా వేదమంత్రాల సాక్షిగా జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకలు భక్తుల కోలాహలంతో, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. గుడి ప్రాంగణం మొత్తం అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఆలయ కార్యనిర్వాహణాధికారి కోగంటి సునీల్ కుమార్ మాట్లాడుతూ బోనాల ఉత్సవాలు మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడతాయని, ఇటువంటి పండుగలను అందరూ కలిసికట్టుగా జరుపుకోవాలన్నారు. అమ్మవారి కి బోనాలు సమర్పించుకోవడం సంతోషంగా ఉందని అంతేకాకుండా భక్తులు కోరుకున్న కోరికలను తీర్చే కొంగు బంగారు తల్లి అమ్మవారు తప్పక నెరవేరుస్తుంది అనే నమ్మకం అన్నారు. భక్తులకు అన్ని వసతులు కల్పించడంలో కమిటీ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారన్నారు. వ్యవస్థాపక ధర్మకర్త డి.రంగ ప్రసాద్, సిబ్భంది బి. రాజేష్ తదితరులు పర్యవేక్షించారు. దాతలు చండీ హోమ పూజా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అర్చకులు సుబ్రమణేశ్వర శర్మ, అర్చకులు దేవమణి కృష్ణ శర్మ భక్తులకు ఆశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శిచుకున్నారు.
Prajavartha Online Telugu News