-ఇప్పటివరకు మొత్తం 59.29 లక్షల అధిక రక్తపోటు, 48.15 లక్షల మధుమేహం కేసుల గుర్తింపు
-ఇందులో కొత్తగా 11.79 లక్షల బీపీ, 10.72 లక్షల మధుమేహం కేసులను తాజా సర్వే ద్వారా గుర్తింపు
-మిగిలిన కేసులు అంత ముందు సర్వేల ద్వారా గుర్తింపు
-గిరిజనుల జీవన శైలి కారణంగా అల్లూరి జిల్లాలో అత్యల్ప బీపీ, మధుమేహం కేసులు నమోదు
-సర్వే పురోగతిని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ కు నివేదించిన అధికారులు
-మిగిలినవారు కూడా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి విజ్ఞప్తి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అసాంక్రమిక వ్యాధులను ముందుగానే గుర్తించి, సకాలంలో చికిత్స అందించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్‌సీడీ 4.0 కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 2,82,38,795 మందికి పరీక్షలు పూర్తయ్యాయి. 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న జనాభాను లక్ష్యంగా చేసుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 66.05 శాతం పరీక్షలు పూర్తయ్యాయని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సర్వే తాజా పురోగతి నివేదికను రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు మంత్రికి నివేదించారు
సర్వే – పరీక్షల పురోగతి
2025 సెప్టెంబర్ 17న ప్రారంభమైన ఎన్‌సీడీ 4.0 కార్యక్రమంలో భాగంగా 2026 ఆగస్టు 31 నాటికి 3,71,86,846 మందికి సర్వే పూర్తయ్యింది. ఇది లక్ష్య జనాభాలో 86.97 శాతం. సర్వే కోసం వెళ్లినప్పుడు ఇళ్ల వద్ద లేకపోవడం, వలసలు వెల్లడం, మరణాలు ఇతరత్రా కారణాల వల్ల స్థానికులు అందుబాటులో లేరు. ఈ క్రమంలో రాష్ట్ర జనాభా (4,27,56,478)లో ఇప్పటి వరకు 2,82,38,795 మందికి పరీక్షలు(66.05%) జరిగాయి.
అధిక రక్తపోటు-మొత్తం కేసులు
Ncd. O4 కింద ఆగస్టు 2026 వరకు రాష్ట్రంలో మొత్తం 59.29 లక్షల వరకు రక్తపోటు కేసులు ఉన్నట్లు గుర్తించారు.
ఇందులో కొత్త బీపీ కేసులు 11.79 లక్షలు
మధుమేహo కేసులు 48.15 లక్షలు ఉన్నాయి.
ఇందులో కొత్తవి 10.72 లక్షలు
క్యాన్సర్ పరీక్షల వివరాలు
క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు నిర్వహిస్తున్న పరీక్షల్లో భాగంగా క్షేత్ర స్థాయిలో అనుమానితులుగా గుర్తించిన 22,110 నోటి (ఓరల్) క్యాన్సర్, 14,822 రొమ్ము(బ్రెస్ట్) క్యాన్సర్, 18,837 గర్భాశయ ముఖద్వార ( సర్వైకల్) క్యాన్సర్ కేసులను తదుపరి పరీక్షల కోసం క్యాన్సర్ వైద్య విభాగాలకు పంపించారు. తదుపరి పరీక్షల్లో 2,026 నోటి క్యాన్సర్, 3,571 రొమ్ము క్యాన్సర్, 2,076 గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆయా కేసులకు సకాలంలో చికిత్స అందిస్తున్నట్లు మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
జిల్లాల వారీగా అధిక రక్తపోటు, మధుమేహం కేసులు:
అధిక రక్తపోటు కేసుల శాతంలో మొదటి ఐదు జిల్లాలు
1. బాపట్ల – 19.65 శాతం
2. డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ – 19.45 శాతం
3. పశ్చిమ గోదావరి – 19.05 శాతం
4. కృష్ణా – 17.97 శాతం
5. తూర్పు గోదావరి – 17.77 శాతం
తక్కువ శాతం నమోదైన ఐదు జిల్లాలు
1. అల్లూరి సీతారామరాజు – 5.63 శాతం
2. శ్రీ సత్యసాయి – 8.47 శాతం
3. అన్నమయ్య – 9.93 శాతం
4. చిత్తూరు – 10.10 శాతం
5. కర్నూలు – 10.28 శాతం
మధుమేహం కేసుల శాతంలో మొదటి 5 జిల్లాలు
1. బాపట్ల – 16.89 శాతం
2. పశ్చిమ గోదావరి – 15.89 శాతం
3. తూర్పు గోదావరి – 15.23 శాతం
4. ప్రకాశం – 15.19 శాతం
5. కృష్ణా – 15.01 శాతం
తక్కువ శాతం నమోదైన 5 జిల్లాలు
1. అల్లూరి సీతారామరాజు – 1.51 శాతం
2. పోలవరం – 5.88 శాతం
3. శ్రీ సత్యసాయి – 6.56 శాతం
4. కర్నూలు – 6.86 శాతం
5. పార్వతీపురం మన్యం – 7.14 శాతం
సహజ ఆహారం, శారీరక శ్రమతో కూడిన జీవన విధానంవల్లనే అల్లూరి జిల్లాలో కేసులు స్వల్పం: మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్
రాష్ట్రంలో గిరిజన జనాభా అధికంగా ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో అధిక రక్తపోటు, మధుమేహం కేసుల శాతం రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పోలిస్తే అత్యల్పంగా నమోదైందని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎన్‌సీడీ పరీక్షల్లో వెలువడిన గిరిజన ప్రాంతాల్లో కనిపించే సంప్రదాయ జీవన విధానం, సహజ ఆహారానికి ప్రాధాన్యం, నిత్య జీవితంలో శారీరక శ్రమ వంటి అంశాలు ఈ ఆరోగ్య ఫలితాలపై ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయనే విషయాన్ని శాస్త్రీయంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యకరమైన సంప్రదాయ జీవన విధానంలోని మంచి అంశాలను ప్రోత్సహించడంతో పాటు, గిరిజన ప్రాంతాల్లోనూ అసంక్రమిక వ్యాధులపై నిరంతర పరీక్షలు, అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తామని మంత్రి తెలిపారు. సర్వే కోసం ఇళ్లకు వచ్చే సిబ్బందికి సహకరించి స్క్రీనింగ్ చేయించుకోవాలని ప్రజలను కోరారు. త్వరలో ఎన్సీడీ-04 సర్వే ముగు స్తుందని మంత్రి వెల్లడించారు.
Prajavartha Online Telugu News