Breaking News

చేనేతలకు సకాలంలో ఆప్కో చెల్లింపులు

-కొనుగోళ్లు చేసిన వస్త్రాలకు ఎప్పటికప్పుడు సహకార సంఘాలకు చెల్లింపులు
-రెండేళ్లలో రూ.24.51 వస్త్రాలకు పేమెంట్లు
-మొదటి ఏడాది రూ.18.02 కోట్ల మేర చెల్లింపులు
-రెండో ఏడాది కూడా పూర్తిస్థాయిలో చెల్లింపులు
-రూ.కోటీ 3 లక్షల మేర లివరీ బకాయిలు బ్యాంకు ఖాతాల్లో జమ
-సత్ఫలితాలిస్తున్న మంత్రి సవిత సమీక్షలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేనేత రంగ అభివృద్ధికి, నేతన్నల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ వస్తోంది. ఒకవైపు రాష్ట్రంలో చేనేత క్టస్లర్లు, టెక్స్ టైల్స్ పార్కులు ఏర్పాటు చేస్తూనే, మరోవైపు నేతన్నలకు 365 రోజులూ ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఆప్కో ద్వారా చేస్తున్న చేనేత వస్త్రాలకు సంబంధించిన కొనుగోళ్లకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తూ చేనేత సహకార సంఘాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తోంది. 2019-24 మధ్య నాటి ప్రభుత్వం ఆప్కో ద్వారా చేసిన కోనుగోళ్లకు సంబంధించి చెల్లింపులు ఏనాడూ సకాలంలో చేయలేదు. దీనివల్ల చేనేత సహకార సంఘాలకు ఆప్కో బకాయిలు పెరుగుతూ రాసాగాయి. దీనివల్ల చేనేత సంఘాలపై విపరీతమైన ఆర్థిక భారం పడసాగింది. చెల్లింపులు నిలిచిపోవడంతో నేతన్నలు కుటుంబాలు అర్థాకలితో అలమటించసాగాయి. నేతన్నల కష్టాలను సీఎం చంద్రబాబునాయుడు, పాదయాత్రలో మంత్రి నారా లోకేశ్ తెలుసుకుని, అధికారంలోకి రాగానే, ఆప్కో ద్వారా కొనుగోలు చేసే వస్త్రాలకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆప్కో ద్వారా కొనుగోలు చేసే వస్త్రాలకు తక్షణ చెల్లింపులు చేస్తూ వస్తున్నారు. సకాలంలో కొనులు చేసిన వస్త్రాలకు చెల్లింపులు చేయడం ద్వారా చేనేత సంఘాలపై ఆర్థిక భారం పడకుండా ఉండడంతో పాటు నేతన్నలకు నిత్యం ఉపాధి లభించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ వస్తోంది. లివరీ చెల్లింపులు సైతం చేస్తూ, చేనేత సహకార సంఘాలకు ఆసరాగా ఉంటోంది.

24 నెలల్లో రూ.24.51 కోట్ల చెల్లింపులు

చేనేతలు గౌరవప్రదమైన జీవనం సాగించడమే సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లక్ష్యం. ఇందులో భాగంగా ఆప్కో ద్వారా కొనుగోలు చేసే వస్త్రాలకు ఏప్రిల్ 2024 నుంచి ఏ నెల కానెల చెల్లింపులు చేస్తూ వస్తున్నారు. మొదటి ఏడాది చేనేత సహకార సంఘాల నుంచి ఆప్కో అధికారులు 18,03 కోట్ల విలువైన వస్త్రాలను కొనుగోలు చేశారు. ఇందుకు గానూ రూ.18.02 కోట్ల మేర చెల్లింపులు చేశారు. రెండో ఏడాదిలో కూడా పూర్తిస్థాయి చెల్లింపులు చేశారు. ఈ ఏడాది మార్చి వరకూ రూ.6.61 కోట్ల వస్త్రాలను చేనేత సంఘాల నుంచి కొనుగోలు చేయగా, పూర్తి స్థాయిలో ఆ సంఘాలకు చెల్లింపులు చేశారు. రెండేళ్లలో రూ.24.51 కోట్లను చెల్లించి, చేనేత సంఘాలపై ఆర్థిక భారం పడకుండా, నేతన్నలకు నిత్యం ఉపాధి ఉండేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

రూ.కోటీ 3 లక్షల లివరీ చెల్లింపులు

మంత్రి సవిత ఆదేశాల మేరకు చేనేత, జౌళి శాఖాధికారులు రాష్ట్రంలోని వివిధ చేనేత సహకార సంఘాలకు రూ.1,03,38,678లను మంగళవారం చెల్లించారు. వివిధ శాఖలు, గురుకులాల పాఠశాలలకు సరఫరా చేసిన చేనేత లివరీ వస్త్రాలకు సంబంధించి ఈ చెల్లింపులు చేశారు. 20 చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఆ చెల్లింపులను జమ చేశారు. త్వరలో మిగిలిన బకాయిలను కూడా చెల్లించేలా అధికారులు చర్యలు చేపట్టారు.

చెల్లింపులపై మంత్రి సవిత ప్రత్యేక దృష్టి

సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ దిశా నిర్దేశంలో చేనేత సహకార సంఘాలకు సకాలంలో చెల్లింపులు జరిగేలా రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ప్రత్యేక దృష్టి సారించారు. చేనేత సహకార సంఘాల ఆర్థిక బలోపేతంలో భాగంగా ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలు కొనుగోళ్లు జరిగేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నేటి తరం అభిరుచులను దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఏయే వస్త్రాలు కావాలో ఆయా సంఘాలకు ఆప్కో ద్వారా ఆర్డర్లు అందజేస్తున్నారు. అదే సమయంలో ఆయా సంఘాల నేతలతోనూ సమావేశమై వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వస్త్రాలు తయారు చేయాలని సూచిస్తున్నారు. శిక్షణా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయడమే కాకుండా వాటికి తక్షణ చెల్లింపులు చేసేలా ఆప్కో అధికారులతో మంత్రి సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆప్కో చరిత్రలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత బకాయిల్లేకుండా మంత్రి సవిత తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పిఠాపురం పట్టణం అభివృద్ధికి రూ.308.24 కోట్లు

-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో అభివృద్ధి పనులు -రూ. 200 కోట్లతో భూగర్భ మురుగు నీటి వ్యవస్థ -ఏలేశ్వరం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *