Breaking News

ఇంద్రకీలాద్రి పై ధన్వంతరీ హోమం, ఆయుష్ హోమము…

ఇంద్ర‌కీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ధన్వంతరి జయంతి ని పురస్కరించుకుని లోకసంరక్షణార్థం మరియు కోవిడ్ -19 పూర్తిగా నిర్మూలింపబడి ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని సంకల్పించి, ధర్మపథం కార్యక్రమంలో భాగంగా గురువారం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము నందు ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ  మరియు వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ధన్వంతరీ హోమము మరియు ఆయుష్ హోమము దేవస్థానం వారిచే నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమము నందు ఆలయ పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ , పాలకమండలి సభ్యురాలు  కత్తిక రాజ్యలక్ష్మి, కటకం శ్రీదేవి  పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు ఆలయ ప్రధానార్చకులు లింగంభొట్ల దుర్గాప్రసాద్, ఆర్.శ్రీనివాస శాస్త్రి, అర్చక సిబ్బంది, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి వార్లు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నందు భక్తులు విశేషముగా పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *