దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న నీతి ఆయోగ్ జాతీయ వైస్ ఛైర్మన్ డా.రాజీవ్ కుమార్…

ఇంద్ర‌కీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను నీతి ఆయోగ్ జాతీయ వైస్ ఛైర్మన్ డా.రాజీవ్ కుమార్ గురువారం ద‌ర్శించుకున్నారు. నీతి ఆయోగ్ జాతీయ వైస్ ఛైర్మన్ డా.రాజీవ్ కుమార్ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, శ్రీ దుర్గమ్మ వారి ఆలయమునకు విచ్చేయగా దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా.జి.వాణీ మోహన్, IAS, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ మరియు వారితో పాటు వచ్చిన 7 మంది అధికారులు శ్రీ అమ్మవారి ఖడ్గమాలార్చన సేవ యందు పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులు మరియు వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేయగా ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ కి మరియు అధికారులకు శ్రీ అమ్మవారి శేషవస్త్రము, ప్రసాదములు, చిత్రపటం అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *