Breaking News

జగనన్న పాలవెల్లువ ద్వారా పాడి పరిశ్రమకి మంచి రోజులొస్తాయి: జిల్లా కలెక్టర్ జె.నివాస్.

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పాడి పరిశ్రమకు జగనన్న పాలవెల్లువ పధకం ద్వారా మంచి రోజులొస్తాయని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు. నూజివీడు మండలం గొల్లపల్లిలో జగనన్న పాలవెల్లువ పాలవెల్లువ కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ పధకం మహిళా పాడి రైతుల పాలిట వారమన్నారు. జిల్లాలో ప్రైవేట్ డెయిరీ ల దోపిడీ నుండి పాడి రైతులను రక్షించి వారి ఆర్థికాభివృద్ధికి జగనన్న పాలవెల్లువ పధకం తోడ్పడుతుందన్నారు. ఈ పధకాన్ని జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు త్వరలో ప్రారంభిస్తారన్నారు. అమూల్ సంస్థ ద్వారా పాల సేకరణ పూర్తి శాస్త్రీయ పద్దతిలో జరుగుతుందని, ఆధునిక యంత్రాల ద్వారా వెన్న శాతం లెక్కింపు చేయడంతో ఖచ్చితత్వంతో పాటు సేకరించిన పాలకు మంచి ధర అందిస్తారన్నారు. ఈ పధకం అమలుకుజిల్లాలో 303 గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందని, ఒక్క సేకరణకు 27 రూట్లను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ప్రతీ గ్రామంలోనూ జగనన్న పాలవెల్లువకు ప్రత్యేక భవనం ఏర్పాటు చేయడం జరిగిందని, కొన్ని ప్రాంతాలలో తాత్కాలికంగా రైతు భరోసా కేంద్రాలలో పాల సేకరణ చేయడం జరుగుతుందని, కొద్దీ రోజుల్లో ఆయా గ్రామాలలో కూడా శాశ్వత భవనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జగనన్న పాలవెల్లువ పధకం విజయవంతంగా అమలు చేసేందుకు ప్రతీ గ్రామంలోనూ గ్రామ డెయిరీ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సంఘంలో గ్రామానికి చెందిన 11 మహిళా పాడి రైతులు ప్రమోటర్లుగా ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. గ్రామ డెయిరీ సంఘము నిర్వహణకు అదే గ్రామానికి చెందిన మహిళలను సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రెటరీలుగా నియమించడం జరుగుతుందన్నారు. ప్రతీ గ్రామ డెయిరీ సంఘమునకు 2 లక్షల రూపాయల విలువైన వెన్న శాతం కొలిచే యంత్రాలు, కంప్యూటర్లు వంటి యంత్ర పరికరాలు అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమలో జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ గుడిమెళ్ళ కృష్ణంరాజు, మండలాధ్యక్షురాలు ఆరేపల్లి శిరీష, తహసీల్దార్ డి.వి.ఎస్. ఎల్లారావు, ఎంపిడిఓ జి. రాణి, పశుసంవర్ధక శాఖాధికారి ఉమ, సర్పంచ్ బి.వెంకటేశ్వరమ్మ, ఎంపిటిసి రేణుకా ధనలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *