
-అమరజీవి పొట్టి శ్రీరాములు విద్యార్థులకు ఆదర్శం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, అధినేత గాంధీ నాగరాజన్ ఆధ్వర్యంలో బుధవారం ముత్యాలంపాడు, జి.యస్.ఆర్.ఎమ్ సి. హైస్కూల్ నందు అమరజీవి పొట్టి శ్రీరాములు 69వ వర్దంతి వేడుకలను ప్రభుత్వ పాఠశాల నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజులపాటు గాంధేయ మార్గంలో పోరాటంచేసి ప్రాణత్యాగం చేసి ప్రతి ఆంధ్రుడు గుండెల్లో అమరుడై పొట్టి శ్రీరాములు నిలిచారని, వారు గాంధీజీతో కొనియాడబడిన గొప్ప వ్యక్తి అని, ఆలయాల్లోకి హరిజనుల ప్రవేశం కోసం ఇరవై మూడు రోజుల పాటు నిరాహార దీక్షలు చేసిన గొప్ప వ్యక్తి అని అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విద్యార్థులలో సృజనాత్మకత ఆలోచనలను వెలికితీయడానికి అమరజీవి పొట్టి శ్రీరాములు-పోరాటంలో గట్టి శ్రీరాములు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. దేశంలో ఉన్న ప్రతి పౌరుడుకి జాతీయత భావాలు ఎంత అవసరమో సోదరి సోదర భావాలు అంతే పెంపొందించుకోవాలని, ఎప్పుడైతే ప్రతి ఆడబిడ్డకు తల్లిగా చెల్లిగా భావిస్తామో వారికి రక్షణతో పాటు పురుషులకు కూడా రక్షణ లభిస్తుందన్నారు. పిల్లల్లో జాతీయత భావాలను, మానవతా విలువలు, సోదరి, సోదర భావాలు పెంపొందించుటకై ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. పిల్లల్లో గల దేశభక్తిని పెంపొందించేలా అమరజీవి పొట్టి శ్రీరాములు-పోరాటంలో గట్టి శ్రీరాములు అనే శీర్షికనిచ్చి పిల్లల్లో ఆలోచన దృక్పథాలను తెలుసుకున్నామన్నారు. భారతరత్న సర్ధార్ వల్లభాయి పటేల్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య లకు నివాళులర్పించారు. అనంతరం వక్తృత్వ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ సెక్రటరీలు డి.ప్రణవ్ జైసూర్య, వి.రమేష్‌లు నిర్వహణ చేయగా నాగరాజన్ సతీమణి, కుమారుడు ఆర్.ఎన్.శివరంజని, ఆర్.ఎన్.కార్తీతో పాటు సెక్రెటరీలు ఎల్.శ్రీను, షేక్ జుబేధా బేగం, బి.భారతి, సౌజన్య, దుర్గ, శ్రీదేవి, అపర్ణలు, విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News