Breaking News

సబ్ కలెక్టర్ గవర్నమెంటు హాస్పిటల్ లో సమీక్ష

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కొత్త ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని విభాధిపతులతో గురువారం సమావేశమైన విజయవాడ సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ రానున్న రోజుల్లో నిర్వహించ తలపెట్టిన హస్పిటల్ అభివృద్ధి కమిటీ మీటింగు కొరకు సమీక్ష నిర్వహించారు . ఈ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను సబ్ కలెక్టరు ప్రవీణ్ చంద్ మీడియాకు వెల్లడిస్తూ సూపర్ స్పెషాలిటీ పియంఎస్ఎస్ వై బ్లాక్ ను వెంటనే హాస్పిటల్ స్వాధీనం చేసుకోవాలని దానికి ప్రిన్సిపల్ , కాంట్రాక్టరు, సూపరింటెండెంట్ తదితరులతో మీటింగు ఏర్పరాచాలని ఆదేశించినట్ల్లు తెలిపారు. క్యాన్సర్ రేడియోధెరపీ ,కీమో ధెరపీ ఓపి ఏర్పరచినందులకు అభినందిస్తూ , కాన్సర్ రోగులకు సంపూర్ణ వైద్యం అందించాలని ఆదేశించారు. యూరాలజీ డిపార్టుమెంటు ను త్వరితగతిన ప్రారంబించాలని, కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు ఇక్కడే చేయడానికి ఏర్పాట్లు చేయాలని చెప్పడం జరిగిందన్నారు. సూపర్ స్పెషాలిటీ నందు 10 డయాలసిస్ లు ప్రారంభించాలని కోరామని దానికి… సోమవారమే వాటిని ప్రారంబిస్తున్నామని సూపరింటెండెంట్ చెప్పడం జరిగిందన్నారు. గుండె స్తెంట్లు ఆరోగ్యశ్రీ లేకున్నా పేదవారికి చేయాలని అధికారులను కోరామన్నారు. గుండె ఆపరేషన్లు చేయు మిషినరీలు వెంటనే అమర్చి గుండె ఆపరేపరేషన్లు పేదలకు అందుబాటులోకి తేలావని కోరడం జరిగిందన్నారు. ఊపిరితిత్తుల విభాగానికి దాతల సహకారంతో స్కాన్ మిషిన్ ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. న్యూరాలజీ ఒపి ప్రతిరోజూవుండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించమన్నారు.ఆస్పత్రి సూపరింటెండెంట్ కాజువాలిటీ పెంపుదల చర్యలు త్వరితగతిన చేయించాలని కోరగా , సత్వరచర్యలకు ఆదేశించమన్నారు. అన్ని విభాగాల అధిపతులిచ్చిన వినతులు పరిశీలించి వారికి చేయూతనిస్తామని చెప్పడం జరిగిందన్నారు. వైద్యులందరు సమయపాలన పాటించాలని ,సత్వర వైద్యం అందించాలని ఆయన కోరారు. స్త్రీల వైద్యం విభాగానికి సి.టి.జి పరికరం ఇస్తామని హామిఇచ్చారు. బయోమెడికల్ పనిచేయని వస్తువుల్ని గుర్తించాలని కోరారు. కంటివిభానికి 2 ఆపరేషన్ టేబుల్స్ ఇస్తామని చెప్పారు. విభాగాధిపతులందరూ పేదలకు సత్వర వైద్య సేవలు అందేలా పర్యేక్షిస్తూ ,సిబ్బందికి సరైన సూచనలిస్తూ ప్రజావిమర్శ లకు తావులేకుండా చూడాలని సబ్ కలెక్టర్ కోరారు. సమావేశం లో జిజిహెచ్ సూపరింటెండెంట్ వై.కిరణ్ కుమార్ తదతరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *