Breaking News

స్పందనలో వచ్చిన అర్జీలను సంబందిత శాఖాధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలి…

-జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం (ఓటీఎస్)పై అధికారులు లబ్దిదారులుక అవగాహన కల్పించాలి..
-డివిజన్ పరిదిలో గల రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.
-థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలో పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నందున ప్రతి ఒక్కరు వ్యాక్సన్ వేయించుకోవాలి.
-ఆర్డీవో శ్రీనుకుమార్

గుడివాడ,  నేటి పత్రిక ప్రజావార్త :
స్పందనలో వచ్చిన ప్రతి అర్జీని నిర్ణీత కాలంలోనే పరిష్కరించి దరఖాస్తు దారులకు న్యాయం చేయాలని ఆర్డీవో శ్రీనుకుమార్ అధికారులను ఆదేశించారు.
స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఆర్టీవో శ్రీనుకుమార్ డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు ఇచ్చిన అర్జీలు సంబందిత శాఖల అధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించి అర్జీదారులకు న్యాయం చెయ్యాలన్నారు. తమ పరిధిలోని కాని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందున్న డివిజన్ పరిధిలో గల మండల స్థాయి, గ్రామ స్థాయిలోని సచివాలయాల్లో ఏ ఒక్క అర్జీ పెండింగ్ లో లేకుండా పరిష్కరించాలన్నారు.
లబ్దిదారులు ఓటీఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా లబ్దిదారులకు రిజిస్టరు ప్టట్టా డాక్యుమెంట్ ను ప్రభుత్వం అందిస్తుందన్నారు. లబ్దిదారులు తమ ఇంటి పై పూర్తి స్థాయి హక్కును పొందేందుకు, క్రయ విక్రయాలను రిజిస్ట్రేషన్ ద్వారానే జరిగిందేందుకు ప్రభుత్వం అవకాశాన్ని కల్పించిందన్నారు. లబ్దిదారులు ఓటీఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 21 న గుడివాడ అలంకృత కళ్యాణ మండపలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఓటీఎస్ జిల్లా స్థాయి కార్యక్రమం ఉదయం 11 గంటలకు నిర్వహించడం జరగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు, కలెక్టరు పాల్గొని లబ్దిదారులకు రిజిస్టర్ డాక్యుమెంట్ పట్టా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరు వేయించుకోవాలి. :-
కోవిడ్ థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలో పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నందున ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలన్నారు కోవిడ్ పోయిందని ఎవరూ భావించవద్దని, ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలన్నారు.
డివిజన్ పరిధిలో రైతులు ఖరీప్ లో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ఆర్బీకేల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అర్జీ .-
కృష్ణాజిల్లా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ పామర్రు బ్రాంచ్ కార్యదర్శి తమ సిహెచ్ ఆదినారాయణ సీనియర్ సిటిజన్ వెల్పేర్ భనన నిర్మాణానికు రెండు లేదా మూడు సెంట్లు ప్రభుత్వ భూమిని కేటాయించాలని అర్జీలో కోరారు.
కార్యక్రమంలో కార్యాలపు ఏవో స్వామినాయుడు, డీటీ బాలాజీ, డిఎల్పీవో నాగిరెడ్డి, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర అధికారిణి గురవమ్మ, ఆర్ డబ్ల్యూఎస్.ఈఈ లీలా కృష్ణ, డ్రైనేజీ ఏఈ ప్రసాద్, ఆర్ అండ్ బీ కార్యాలపు సీ.అ. మహేష్, కోపరేటివ్ కార్యాలపు జూ.అ.సి.గోవీనాధ్, ఐసీడిఎస్ సూపర్ వైజర్ బేబీ సరోజిని తదితరులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *