Breaking News

సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలను అభినందించిన గవర్నర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్న ప్రముఖ తెలుగు జానపద గాయకుడు, గేయ రచయిత  గోరటి వెంకన్నను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. వల్లంకి తాళం’ అనే తెలుగు పద్యానికి గాను తాజాగా ప్రకటించిన 2021 అవార్డులలో వెంకన్న స్థానం పొందారు. మరోవైపు తన తెలుగు రచన ‘దండకడియం’ (కవిత్వం)కి సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని గెలుచుకున్న తాగుళ్ల గోపాల్‌ను, తెలుగు నాటకం ‘నేను అంటే ఎవరు?’ కోసం బాల సాహిత్య పురస్కారాన్ని గెలుచుకున్న దేవరాజు మహారాజును కూడా గవర్నర్ శ్రీ హరిచందన్ అభినందించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *