నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కోటీ 10 లక్షల రూపాయలతో అధునాతన ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు చెప్పారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఏరియా ఆసుపత్రిలో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న దృష్ట్యా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా పటిష్టమైన వైద్య సేవలందించేలా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. కోవిడ్ మొదటి, రెండవ వేవ్ లలో ప్రజలు అపప్రమత్తతో లేని కారణంగా ఎన్నో ప్రాణాలను కోల్పోయామన్నారు. థర్డ్ వేవ్ మరింత విజ్రంభించే అవకాశం ఉన్న దృష్ట్యా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు పటిష్టమైన ముందస్తు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఆక్సిజన్ ప్లాంట్ మరికొద్ది రోజుల్లో వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. థర్డ్ వేవ్ హెచ్చరిక దృష్ట్యా ప్రభుత్వ ఆసుపత్రులను సంసిద్ధం చేయాలనీ, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వహణకు సంబందించిన ఖర్చులను కమిటి సమావేశంలో సభ్యులు ఆమోదించారు.
అనంతరం ఆక్సిజన్ ప్లాంట్ ను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. , ఆసుపత్రి అత్యవసర విభాగంలో పేషంట్లకు అందుతున్న వైద్య సేవలను ఎమ్మెల్యే పరిశీలించారు. రెవిన్యూ డివిజనల్ అధికారి కె. రాజ్యలక్ష్మీ, కమిటీ మెంబరు మరియు కన్వీనర్ డా.. ఆర్. నరేంధ్రసింగ్,
కమిటీ సభ్యులు బసవరాజు నగేష్, డా.. వీరభద్రరావు, డా.. శారద, డా. మంజూష, డా.. నాగమణి, ఏరియా ఆసుపత్రి సిబ్బంది డాక్టర్లు నవీన్, రత్నతేజ, రవికుమార్, అనూష, శ్రీకాంత్, వరప్రసాద్, సహనం, విజయ, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News