Breaking News

నేటి నుంచి రెండు రోజులపాటు వసంతం ఎగ్జిబిషన్‌…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక శేషసాయి కళ్యాకళ్యాణ వేదికలో వసంతం ఎగ్జిబిషన్‌ను నేటి నుంచి రెండు రోజులపాటు నిర్వమించనున్నట్లు క్రాఫ్ట్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ సెక్రటరీ ఎస్‌.రంజన తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ హస్తకళలు, చేనేత వృత్తులు వెలకట్టలేనివని, ఇవి కార్బన్‌ ముద్రలు లేనివని, ఈ అంశం రాబోవు తరాలకు అతిపెద్ద చర్చయనీయాంశమన్నారు. వసంతం 2022లో అప్కోవారికి ఆతిధ్యం ఇవ్వడం గర్వంగా ఉందన్నారు. ఈ ప్రదర్శనలో వివిధ ప్రాంతాలలోని హస్తకళలు, అల్లికలు, కొన్ని బ్లాక్‌ప్రింట్స్‌, అన్ని వయస్సుల వారికి డిజైనర్‌ దుస్తులు, ఆజ్రాఖ్‌, ఫైన్‌ బెంగాల్‌ నేత వస్త్రాలు, కచ్‌క ,కంచి నుంచి నేత వస్త్రాలు, గృహోపకరణాలు, వంటసామాన్లు, పిల్లల కొరకు ఉత్తరప్రదేశ్‌ నుంచి గేమ్‌లు అందుబాటులో ఉంటాయన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరచిన వారికి పురస్కారాలు ఇవ్వాలని ఈ సంవత్సరం నిర్ణయించుకున్నామని, అందుకుగాను మొదటి పురస్కారానికి గౌరభతిని రమణయ్యని సత్కరించాలని నిర్ణయించామని వివరించారు. ఈ కార్యక్రమంలో క్రాఫ్ట్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రమీల, శైలజ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *