-శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
తెనాలి బ్రాహ్మణ పరిషత్ సేవలు రాష్ట్రానికేఆదర్శనీయమని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు .స్థానిక రామలింగేశ్వర పేటలోని మూల్ఫూరి సబ్రమణ్యశాస్త్రి కళ్యాణ మండపం లో శనివారం 15న జరిగిన నూతన సం॥కేలండర్ ఆవిష్కరణ సభకు ఆయన ముఖ్య అతిథి గా హాజరై కెలండరును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ అన్ని వర్గాలతో పాటూ బ్రాహ్శణుల సంక్షేమానికి విశేషకృషి చేస్తుందని డైరక్టరు పదవికి తాను సిఫార్సు చెసిన T.ప్రసూనాంబను జగన్మోహనరెడ్డి ఆమోదించటం బ్రాహ్మణ సమాజం పట్ల తమ చిత్త శుథ్థిని నిరూపిస్తుందని హర్షథ్వానాలమథ్య అన్నారు. తన నియేజక వర్గ బ్రాహ్శలకు YSR చేయూత అర్హులను ఎంపిక చెయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి మండల పరిషత్ అద్యక్షులు Ch శ్రీనివాసరావు, డైరక్టరు T.జ్ఞానప్రసూనాంబ, పరాశరం రాంగోపాల్ తది బ్రాహ్మణ నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News