రెడ్డిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న పాల వెల్లువ ద్వారా పాడి రైతుల జీవితాలలో వెలుగులు నింపుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ డా.కె. మాధవీలత అన్నారు. రెడ్డిగూడెం మండలం కూనపరాజపర్వ గ్రామంలో జగనన్న పాల వెల్లువ కార్యక్రమం ప్రగతిపై అధికారులు, ప్రమోటర్లు, పాడి రైతులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ జగనన్న పాల వెల్లువ ద్వారా జిల్లాలోని కొంతమంది పాడి రైతులు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారన్నారు. మిగిలిన పాడి రైతులు కూడా ఈ ప్రయోజనాలను పొందే విధంగా జగనన్న పాల వెల్లువ పథకంగా అవగాహన కలిగించాలన్నారు. ప్రైవేట్ పాల డైరీలు అందించే రేటు కన్నా లీటరుకు 15 రూపాయల వరకు అదనంగా లభిస్తున్నదని, పాలు అందించిన 10 రోజులకు ఒకసారి నగదును పాడి రైతుల ఖాతాలోకి వేయడం జరుగుతుందన్నారు. పాడి రైతులకు రుణాలతో పాటు, పాడి పశువులకు మెరుగైన పోషకాలతోకూడిన దాణాను రైతులకు అందించడం జరుగుతుందన్నారు. ఈ ప్రయోజనాలను పాడి రైతులకు తెలియజేసి, మరింత మంది పాడి రైతులు జగనన్న పాల వెల్లువ పాల కేంద్రాలకు పాలు సరఫరా చేసేలా ప్రమోటర్లు, సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలో జగనన్న పాల వెల్లువ ప్రగతిని అధికారులు, సిబ్బందిని జాయింట్ కలెక్టర్ డా. మాధవీలత అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Tags reddygudem
Check Also
యన్.టి.ఆర్ క్రీడాప్రాంగణం సంక్రాంతి సంబరాల పోటీల రిజిస్ట్రేషన్ కు శనివారం సాయంత్రం వరకు గడువు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ, ఈ సందర్భంగా నగర పాలక …