విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ లో కొత్త క్యాజువాలిటి బ్లాక్ ను ఈనెల 21 వ తేదీ లోగా వినియోగంలోకి తీసుకురావాలని సబ్ కలెక్టర్ జి. ఎస్. ఎస్. ప్రవీణ్ చంద్ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. స్థానిక కొత్త గవర్నమెంట్ ఆసుపత్రిని శుక్రవారం అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి, రోగులకు అందుతున్న వైద్య సేవలను వారిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులలో కూడా సేవలందించేందుకు రేడియాలజీ, సి.టి.స్కాన్ విభాగాలను 24 గంటలపాటు నిర్వహించాలన్నారు. కొత్తగా ఏర్పాటుచేసిన ఓ. పి.కౌంటర్లు ప్రజలకు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయో, వెయిటింగ్ టైం ఏ మేరకు తగ్గిందని అక్కడి రోగులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాల రవాణాలో దళారీల వ్యవస్థను రూపుమాపేందుకు వార్డ్ సిబ్బంది, మార్చురీ మరియు మహాప్రస్థానం డ్రైవర్ ల మధ్య సమన్వయం ఉండేలా ఉండాలని, రికార్డులను పక్కాగా నిర్వహించాలని సిబ్బంది సబ్ కలెక్టర్ ఆదేశించారు. సబ్ కలెక్టర్ వెంట వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …