విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గ పెజ్జోన్‌పేటలో మాజీ ముఖ్యమంత్రి, దామోదరం సంజీవయ్య విగ్రహం వద్ద సంజీవయ్య 101వ జయంతి కార్యక్రమం మెడబలిమీ దైర్యానందం అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో 35వ డివిజన్ కార్పొరేటర్ బాలసాని మణమ్మ ముఖ్యఅతిధిగా పాల్గోని కేక్ కట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో ఉన్న పెద్దపాడులో ఒక దళిత కుటుంబములో మునెయ్య, సుంకులమ్మ దంపతులకు ఫిబ్రవరి 14,1921 సంజీవయ్య జన్మించారని, 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కిందని, 1960లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి, బారతదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి అని, సంయుక్త మద్రాసు రాష్ట్రములో, ఆంధ్రరాష్ట్రములో, కేంద్ర ప్రభుత్వములో వివిద మంత్రి పదవులు నిర్వహించారు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకత అని తెలిపారు. సంజీవయ్య శాసన సభలో అధిక సంఖ్యాకుల బలంతో వచ్చిన వ్యక్తి కాదని, సహజంగా కుల, ముఠా రాజకీయాల మధ్య సతమతమయ్యారని, అతను వ్రాసిన లేబర్ ప్రాబ్లమ్స్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పుస్తకాన్ని ఆక్స్ ఫర్డ్ వారు ప్రచురించబడినదని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రిన్సీపల్ సెక్రెటరి, ఆదె, దేవబాబు (ఐ.ఎఫ్,స్), పాటిబండ్ల బాల, మేడేపల్లి డ్య్యంఆనంద్, మొసెస్ రావురి, దాసి సుజాత, మీసాల రాజేశ్వరరావు మెండేపూడి చిన్ని, బోడపాటి సత్యవతి, కుమార్, మరియు స్థానిక పెద్దలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …