-ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మరియు కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన కార్యక్రమానికి వచ్చిన అర్జీదారుల సమస్యలను కూలంకషంగా పరిశీలించి, నాణ్యమైన పరిష్కారం చూపాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.రంజిత్ భాషా, మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమములో మేయర్ మరియు కమిషనర్ ప్రజల నుండి సమస్యల అర్జీలు స్వీకరించారు. ప్రధాన కార్యాలయంతో పాటుగా జోనల్ కార్యాలయాలలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజలు అందించిన అర్జీలను ఆయా శాఖదిపతులకు పంపి సత్వర పరిష్కరం చేసేలా చర్యలు తీసుకోవలెనని, ప్రజల నుండి వచ్చిన వినతులకు సంపూర్ణ పరిష్కారం అందించేందుకు కృషి చెయవలెనని అధికారులను ఆదేశించారు. నేటి స్పందన కార్యక్రమములో మొత్తం 19 అర్జీలు స్వీకరించుట జరిగినది. వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం – 8, పబ్లిక్ హెల్త్ విభాగం – 1, రెవెన్యూ – 1, ఇంజనీరింగ్ విభాగం – 7, ఉద్యాన వన విభాగం – 1, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ – 1. కార్యక్రమంలో అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదాదేవి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, ఎస్.ఇ నరసింహ మూర్తి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సర్కిల్ కార్యాలయాలలో స్పందన…
సర్కిల్ కార్యాలయాలలో జోనల్ కమిషనర్లు స్పందన కార్యక్రమము నిర్వహించగా సర్కిల్ – 1 కార్యాలయంలో రెవెన్యూ – 1, సర్కిల్ – 2 కార్యాలయంలో రెవెన్యూ – 1, అర్జీ అందించగా సర్కిల్ – 3 కార్యాలయంలో ఏవిధమైన అర్జీలు వచ్చి యుండలేదు.