-జాతీయ సఫాయికర్మచారి కమిషన్ సభ్యులు డా. పి.పి.వవ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ సఫాయికర్మచారి కమిషన్ మెంబర్ డా.పి.పి.వవ విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు జిల్లా పరిధిలో గల మునిసిపల్ కమిషనర్లు మరియు వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ శ్రీ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) శ్రీ మోహనరావు, డిప్యూటీ మేయర్లు శ్రీమతి బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ సఫాయికర్మచారి కమిషన్ సభ్యులు డా. పి.పి.వవ మాట్లాడుతూ సఫాయికర్మ చారి కమిషన్ ఫైనాన్సింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాభాపేక్ష లేకుండా నిరంతరం పని చేస్తుందని, విద్యార్ధులకు స్కాలర్ షిప్ ల మంజూరు వంటి పలు అంశాలను వివరిస్తూ, వివిధ రాష్ట్రాలలో సఫాయికర్మచారి కార్మికులకు చేరువలో ఉన్న పలు సంక్షేమ పథకములు వివరించారు. చిత్తు కాగితాలు ఏరుకునే వారి నుండి పారిశుధ్య పనులు నిర్వహించు ప్రతి ఒక్కరు కూడా సఫాయికర్మ చారి కార్మికునిగా పరిగణించుట జరుగుతుందని, వారందరికి ప్రధాన మంత్రి ఆయుష్ భవ పథకం ద్వారా వైద్య సౌకర్యాలు కలిపించుట మరియు PMAY పథకం క్రింద గుర్తించిన నిరుపేద సఫాయికర్మ చారి కార్మిక కుటుంబాలకి గృహాల మంజూరు చేయట వంటి అంశాలను సమగ్రంగా వివరించారు. నగరపాలక సంస్థ మరియు వివిధ మున్సిపాల్టి లలో సఫాయికర్మచారి కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యలు మరియు పథకములను అధికారులను అడిగితెలుసుకోనుటతో పాటుగా సఫాయికర్మచారి స్టేక్ హోల్డర్స్ లను వారి యొక్క సమస్యలు మరియు ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సఫాయికర్మచారి కుటుంబము మరింత వెలుగులోనికి రావాలని, వారి పిల్లల భవిష్యత్ బాగుండాలని వారికీ చట్ట ప్రకారం లబించిన అన్ని ప్రయోజనాలు అన్డునట్లుగా చూడవలెనని, మానవతాదృక్పదంతో వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించవలెనని అన్నారు. ఈ సందర్భంగా యునియన్ నాయకులు ఎస్.సి, ఎస్.టి లోన్ లకు సంబంధించి కలుగుతున్న ఇబ్బందులు, నగరపాలక సంస్థ ద్వారా రావలసిన పెన్షన్, కారుణ్య నియామకాలు వంటి పలు సమస్యలను నాయకులు తెలియజేసారు.
ఈ సందర్భంలో విజయవాడ నగరంలో పారిశుధ్య కార్మికులకు కల్పిస్తున్న సదుపాయాలను కమిషనర్ రంజిత్ భాషా వివరిస్తూ, APCOS ద్వారా కార్మికులకు 1వ తేదిన వేతనములు ప్రభుత్వం ద్వారా చెల్లించుట మరియు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.6000/- కార్మికుల ఆరోగ్య ఖర్చుల నిమిత్తం అదనంగా ఇవ్వటం జరుగుతుందని తెలియజేసారు. విజయవాడ నగరం జాతీయ స్థాయిలో 3వ స్థానం సాధించుట జరిగిందని, పలు సాంకేతిక కారణాల వల్ల నియామకాలు పెండింగ్ లో ఉన్నవని, సఫాయికర్మచారి కమిషన్ సూచనల ప్రకారం కార్మికులకు ప్రభుత్వం వై.ఎస్.ఆర్ ఆరోగ్య శ్రీ మరియు ESI సౌకర్యం ద్వారా వైద్య సేవలను అందుంచుట జరుగుతుందని పేర్కొన్నారు.
అదే విధంగా సఫాయికర్మచారి కమిషన్ మెంబర్ డా.పి.పి.వవ సూచనలు మరియు జి.ఓ ల ప్రకారం కార్మికులకు తక్షణమే అవకాశాలు కలిపించి వారికీ రావలసిన బకాయిలు త్వరితగతిన వారి కుటుంబ సభ్యులకు అందేలా చర్యలు తీసుకోని, వచ్చే సమావేశంలో పూర్తి కార్యాచరణ రూపొందించి సమర్పించాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా) తెలియజేసారు.
ఉదయం ప్రమాదంలో గాయపడిన పారిశుధ్య కార్మికులకు భరోసా కల్పించిన జాతీయ సఫాయికర్మచారి కమిషన్ మెంబర్ డా. పి.పి.వవ. కొత్త ప్రభుత్వ హాస్పిటల్ నందు నేటి ఉదయం విధి నిర్వహణలో ఉండగా జరిగిన రోడు ప్రమాదంలో చికిత్స పొందుతున్న మరియు మరణించిన నగరపాలక సంస్థ పారిశుధ్య కార్మికుల కుటుంబ సభ్యులను స్వయంగా కలుసుకొని క్షతగాత్రులను పరామర్శించి వారిలో మనోధైర్యoనిస్తూ, ప్రభుత్వం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించుట మరియు నష్ట పరిహారం కల్పించే దిశగా జాతీయ సఫాయికర్మచారి కమిషన్ కృషి చేస్తుందని భరోసా కల్పించారు.
సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అఫ్ పోలీస్ (అడ్మిన్), ED Sc కార్పొరేషన్ బి.చంద్ర లీల, డిప్యూటీ కమిషనర్ లేబర్ సి.హెచ్ రాణి, అడిషనల్ ఎస్.పి ఎస్.వి.డి ప్రసాద్, DSP (SC & ST సెల్ ) వి. ఉమామహేశ్వర రావు, సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ కె.సరస్వతి, నగరపాలక సంస్థ అధికారులు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతభాయి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, అదనపు కమిషనర్ (జనరల్) డా.జె అరుణ, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారద, బండి కాళేశ్వరరావు, యునియన్ నాయకులు డేవిడ్ మరియు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.