విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు స్వర్గీయ దామోదరం సంజీవయ్య శత జయంతి సందర్భంగా ఏపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ కొరివి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో దామోదరం సంజీవయ్య కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో దళిత బడుగు బలహీన వర్గాలకు దామోదరం సంజీవయ్య చేసిన సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ వళిబొయిన గురునాధం, నగర అధ్యక్షుడు నరహారశెట్టి నరసింహ రావు, రాష్ట్ర కార్యదర్శి, కార్యాలయం ఇంచార్జి నూతలపాటి రవికాంత్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ లు తూమాటి బాలు, సనపల రమేష్, నగర కార్మిక సంఘం చైర్మన్ బుదాటి జోసెఫ్, పాలకీర్తి రవి, నగర నాయకులు సింహాద్రి జగన్, మేళం చిన్నా, అన్సారీ, బేగ్, ప్రకాష్, దమ్ము చార్లీ, చిన్ని తదితర నగర డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …