పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక శ్రీహనుమత్ లక్ష్మణ సీతా సమేత శ్రీకోదండరామస్వామి ఆలయ చిన్నగుడి పునః ప్రతిష్ఠా మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో గ్రామ ప్రధాన వీధులు కిటకిటలాడాయి. ధ్వజస్తంభ, శిఖర, జయ, విజయ ద్వార
పాలకుల విగ్రహాలకు పూజలు నిర్వహించి ప్రతిష్టించారు. భారీ ఉన్న సమారాధన జరిగింది. సాయంత్రం రామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం కనుల పండువగా సాగింది. ఎమ్మెల్యే కొలుసు పార్థసారది, దేవాదాయ శాఖ డీఈఈ శ్రీనివాసరావు, సహాయ కమిషనర్ సత్యనారాయణ, కార్యనిర్వహ అధికారి సత్యవతి,(ఏ.పి.యస్.ఆర్.టి.సి), కృష్ణా జిల్లా జోనల్ చైర్మన్ తాతినేని పద్మావతి పలువురు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …