నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందనలో అందిన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్ధానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో సోమవారం స్పంధన కార్యక్రమంలో ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే సంబందిత అధికారులకు ఫోన్ చేసి అదేశాలు జారీ చేశారు. . ఈ సందర్బంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ స్పందన దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వద్దని, జాప్యం లేకుండా నిర్దేశించిన సమయంలోగా వాటిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పేదప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశతో స్పందన కార్యక్రమంలో దరఖాస్తులు అందించి సమస్యలు పరిష్కారంకోసం కార్యాలయాలకు వస్తుంటారని వారిని పలుమార్లు కార్యాలయాల చుట్టూ త్రిప్పుకోకుండా ధరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కారించాలన్నారు. స్పంధన కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి అర్జీ తీసుకువస్తే వాటిని పరిశీలించి పరిష్కారానికి అర్హత దరఖాస్తులను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, పరిష్కారాన్ని వీలుకాని దరఖాస్తులను అందుకు గల కారణాలను ధరఖాస్తుదారులకు తప్పనిసరిగా తెలియజేయలన్నారు. స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించని అధికారులపై చర్యలు తీసుకుంటామని రాజ్యలక్ష్మి హెచ్చరించారు.
చాట్రాయి మండలం చెందిన రైతులు తాము తమ ధాన్యాన్ని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అందించామని 606 బస్తాలకుగాను 538 బస్తాలు మాత్రమే సొమ్ము అందిందని మిగిలిన బస్తాలు సొమ్ము మంజూరు చేయవలసిందిగా కోరియున్నారు. దీనిపై విచారణ చేసి సదరు మొత్తాన్ని రైతుల ఖాతాకు జమచేసేలా చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖాధికారులను ఆదేశించారు. నూజివీడు మండలం హనుమంతునిగూడెం కు చెందిన బంగారపు మౌనిక తన దరఖాస్తులో తనకు జగనన్న ఇళ్ళు పథకం లో ఇంటి స్థలం మంజూరు అయిందని కానీ ఆన్లైన్లో తనపేరు కనబడటం లేదని, కావున తన పేరును ఆన్లైన్ లో నమోదు చేసి, తనకు ఇంటి నిర్మాణానికి మెటీరియల్ మంజూరు చేయవలసిందిగా కొరియున్నారు. దరఖాస్తును వెంటనే పరిశీలించే తగు చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖాధికారులను ఆర్డీఓ ఆదేశించారు. ఆగిరిపల్లి గ్రామానికి చెందిన ఎర్రంశెట్టి సామియేలు తన దరఖాస్తులో తన ఆస్తిని తన కుమార్తెకు రాశానని కానీ తన కుమార్తె ఇటీవల అనారోగ్య కారణంగా చనిపోయిందని తన అల్లుడు ఆస్తిని తీసుకొని తనను నిరాదరణకు గురి చేస్తున్నారని వాపోయింది. సదరు సమస్యపై వెంటనే విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ ను ఆదేశించారు. పెనమలూరు మండలం కానూరు గ్రామానికి చెందిన అడుసుమిల్లు సాంబశివరావు తన దరఖాస్తులో తన పొలంలో వ్యవసాయం సంబంధించి కరెంట్ మంజూరు కి ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా వీఆర్ఓ కి దరఖాస్తు చేసుకున్నానని కానీ ఇంతవరకు మంజూరు ఉత్తర్వులు జారీ చేయలేదని విన్నవించుకున్నారు ఈ విషయంపై వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా తాసిల్దార్ ను ఆర్డీవో ఆదేశించారు.
స్పందన కార్యక్రమంలో డివిజనల్ పరిపాలనాధికారి యం. హరనాధ్, ఇరిగేషన్ ఈ.ఈ., కె.ఎల్.ఎన్. ప్రశాంతి, పంచాయతీరాజ్ అధికారి ఎం. బసవయ్య, డివిజనల్ కో-ఆపరేటివ్ ఆఫీసరు కె. భాస్కరరావు, అసిస్టెంట్ బి.సి. వెల్ఫేర్ అధికారి ఏ .దివ్య, హార్టికల్చర్ ఆఫీసర్ ఎం. రత్నమాల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Tags nuzividu
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …