జాతీయ రహాదారులకు ప్రారంబోత్సవం కార్యక్రమాలకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 17వ తేదీన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పలు జాతీయ, రాష్ట్ర రహదారులకు ఈనెల 17 తేదీన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ఇందీరాగాంథీ మున్సిపల్‌ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రలో కొత్తగా 31 జాతీయ రహదారుల నిర్మాణం, కొత్తగా నిర్మించిన జాతీయ రహాదారులకు ప్రారంబోత్సవం కార్యక్రమాలకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ హాజరు హాజరుకానున్నారన్నారు. కేంద్ర మంత్రితో పాటు ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఉన్నతాధికారులు హాజరు కానున్న దృష్ట్యా కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఏర్పాట్లు పూర్తి చేయాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. వివిధ పాజెక్టులకు సంబంధించి ఏర్పాటు చేసే ఫోటో ఎగ్జిబిషన్‌, అవిష్కరించే శిలాపలకాలు, బహిరంగ సభలో ఏర్పాటు చేయనున్న ఎల్‌ఇడి స్కీన్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రాధాన వేదికపై కేంద్ర మంత్రితో పాటు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఆశీనులు అయ్యే విధంగా ప్రోటోకాల్‌ నిబంధనల మేరకు ఏర్పాటు చేయాలన్నారు. బహిరంగ సభకు హాజరయ్యే ప్రజలకు త్రాగునీరు, తదితర వసతులు కల్పించాలని ప్రతి ఒక్కరూ కోవిడ్‌ నిబంధనలు తప్పని సరిగా పాటించేలా మాస్క్‌, శానిటైజర్‌, అంధించాలని నిర్వహుకులను ఆదేశించారు. ఏర్పాట్ల పరిశీలనలో సబ్‌ కలెక్టర్‌ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌, నేషనల్‌ హైవే ప్రాజెక్టు డైరెక్టర్‌ డివి నారాయణ, మేనేజర్‌ అమృత సాహు, ఎల్‌ ఐ డిఐ పిఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి. రవికిరణ్‌, ప్రాజెక్టు మేనేజర్‌ కె. బ్రహ్మయ్య తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *