విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఒలింపిక్ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్ధేందుకు క్రీడా రంగంలో పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, దీనిలో భాగంగా ప్రతీ జిల్లాలో క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర క్రీడల శాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక కృష్ణలంకలోని అమరజీవి పొట్టి శ్రీరాములు నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన క్రీడా వికాస కేంద్రంను మంగళవారం మంత్రి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధితో పాటు క్రీడాకారుల ప్రోత్సాహానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదన్నారు. ప్రతీ జిల్లాలోనూ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటుచేసి, వాటిలో క్రీడా సదుపాయాలు, క్రీడా పరికరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర క్రీడా ప్రతిష్టను జాతీయ స్థాయిలో నిలిపే ప్రతిభ కలిగిన క్రీడాకారులను మండల, జిల్లా స్థాయిలలో గుర్తించి వారిని అన్నివిధాలుగా ప్రోత్సహిస్తున్నామన్నారు. వారిని ఆ క్రీడా రంగంలో అత్యుత్తమ స్థాయిలో నిలిపే విధంగా క్రీడా సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్, డిప్యూటీ మేయర్ ఏ .శైలజా రెడ్డి, కార్పొరేటర్ పి .కుమారి, శాప్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి పి . రామకృష్ణ,, క్రీడా ప్రాధికారసంస్థ సీఈఓ యు. శ్రీనివాసరావు,, చీఫ్ కోచ్ బి. శ్రీనివాసరావు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్, ప్రభృతులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …