-తెనాలి MLA అన్నాబత్తుని శివకుమార్
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం 27-2-22న జరిగే జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెనాలి MLA అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. శుక్రవారం ఉదయం మునిసిపల్ చైర్ పర్సన్ ఖలేదా నసీం కమిషనర్ జస్వంతరావు వైస్ ఛైర్మన్లు మాలేపాటీ హరి ప్రసాద్ గుంటూరు కోటెశ్వరరావు సహచర కార్యకర్తలతో పోలియో మహమ్మారిని తుదమట్టించాలని పిలుపునిచ్చారు. అథికారులు సమన్వయంతో పనిచేసి పిల్లలకు మంచి ఆరోగ్య వంతమైన జీవితాన్ని ఇవ్వాలన్నారు. ఈ ర్యాలీలో అసిస్టెంటు కమిషనర్ గోపాలరావు, వైద్య అథికారులు శానిటరీ సిబ్బంది అశా అంగన్వాడీలు పలుపాఠశాలల విద్యార్థీనీ విద్యార్థులు NCC, స్కౌట్స్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News