-కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్.,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ బుధవారం అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో జక్కంపూడి గృహ నిర్మాణముల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు యు.సి.డి క్షేత్ర స్థాయి సిబ్బంది మరియు LDM, పి.ఓ టిడ్కో, రూరల్ తాసిల్దార్ లతో సమావేశం నిర్వహించి నిర్మాణ పూర్తి కాబడిన టిడ్కో PMEY హౌసింగ్ లోన్ క్రింద లబ్దిదారులకు బుణాలు మంజూరు ప్రక్రియ వేగవంతము చేయాలని అన్నారు. బుణాలు విషయమై తగు సూచనలు ఇస్తూ, బ్యాంక్ అధికారులతో చర్చించి సత్వరమే బుణాలు మంజూరు చేయునట్లుగా చూడాలని ఆదేశించారు. కార్యక్రమములో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, PO(APTIDCO) కృష్ణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ -JNnURM), ప్రాజెక్ట్ ఆఫీసర్ యు.సి.డి సుధాకర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (APTIDCO), DCO(BL-VMC) మరియు సి.ఓలు సోషల్ వర్కర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.