Breaking News

సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ నందలి డాగ్ ఆపరేషన్ యూనిట్ నందు వీధి కుక్కలకు ఆపరేషన్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ వారి ఉత్తర్వుల మేరకు రేపు ది. 03.03.2022 తేదిన సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ నందలి డాగ్ ఆపరేషన్ యూనిట్ నందు వెటర్నరి అసిస్టెంట్ సర్జిన్ డా.రవిచంద్ పర్యవేక్షణలో వీధి కుక్కలకు ఆపరేషన్ ప్రక్రయ ప్రారంభిస్తున్నట్లు నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతభాయి ఈ ప్రకటన ద్వారా తెలియజేసారు. నగర పరిధిలోని అన్ని వీధికుక్కలకు మరియు పెంపుడు కుక్కలకు ఆపరేషన్ అయిన తదుపరి యాంటి రైబైస్ వ్యాక్షిన్ కూడా ఇవ్వటం జరుగుతుందని అన్నారు. కావున నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న కుక్కల ప్రేమికులు, యజమానులు మరియు బ్లూ క్రాస్ సంస్థ ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకొని నగరపాలక సంస్థతో సహకరించవలెనని విజ్ఞప్తి చేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *