మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
యువత విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించేలా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు, అన్ని రంగాలతోపాటు క్రీడా రంగంలోనూ అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రణాళికలు రూపొందించి యువతను ఎంతో ప్రోత్సాహిస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు (నాని) పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం మచిలీపట్నం హిందూ కళాశాల క్రీడా మైదానంలో వై.యస్.ఆర్-పి.కె.యం క్రికెట్ టోర్నమెంట్ సీజన్ – 2 ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై పేర్ని కిట్టు బౌలింగ్ చేయగా క్రికెట్ బ్యాట్ పట్టుకొని రెండు ఓవర్లు ఆయన ఉత్సాహంగా ఆడారు. తర్వాత విక్టరీ వారియర్స్ , సుధా ఎలెవన్ జట్ల మధ్య ప్రారంభ ఆటలో ఇరుజట్ల క్రీడాకారులను పేరుపేరున పరిచయం చేసుకొని వారికి బెస్ట్ అఫ్ లక్ చెప్పి టాస్ వేసి లాంఛనంగా మంత్రి కొడాలి నాని మ్యాచ్ ప్రారంభించారు.
అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, మన ప్రాంతంలో ఎంతో ప్రతిభ గల క్రీడాకారులు, కళాకారులకు కొదవ లేదని ఆయా రంగాల్లో వారు ఎంతో నైపుణ్యంతో రాణిస్తూ గొప్ప విజయాలను సాధిస్తున్నారన్నారు. మన టీమిండియా మొదటి టెస్ట్ కెప్టెన్ కొట్టారి కనకయ్య నాయుడు ( సి. కె. నాయుడు ) మహారాష్ట్ర లోని నాగపూర్ లో స్థిరపడినా, ఆయన మచిలీపట్నం మూలాలు గల వ్యక్తి అని అన్నారు. అప్పట్లో తెలుగు రాష్ట్రాలు భారత క్రికెట్ టీం కి మంచి ఆరంభాన్నే ఇచ్చాయిని ఆ తరువాత కూడా తెలుగు రాష్ట్రాల నుండి చెప్పుకోతగ్గ ఆటగాళ్లే వచ్చారని మంత్రి కొడాలి నాని చెప్పారు. అప్పట్లో శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్, గులాం అహ్మద్, వేంకటపతి రాజు, అజరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్, ప్రగ్యాన్ ఓఝా, అంబటి రాయుడు హనుమ విహారి లాంటి వాళ్ళు చాలా మంచి ఆటగాళ్లు తమ క్రీడా నైపుణ్యంతో దేశంలోనే ఒక వెలుగు వెలిగేరన్నారు. ఆటలు ఆడటం ద్వారా స్నేహబంధాలు మరింతగా బలపడతాయని, దేహా ఆరోగ్యం మెరుగుపడతాయని అన్నారు.
అనంతరం యువ నాయకుడు , క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు పేర్ని కిట్టు మాట్లాడుతూ, గత ఏడాది ప్రారంభమైన ఈ టోర్నమెంట్ సీజన్- 2 మరలా తన అభిమాన నేత శ్రేయోభిలాషి మంత్రి కొడాలి నాని స్వహస్తాల మీదుగా ప్రారంభం కావడం తనకు రెండింతల సంతోషం కలిగిస్తుందన్నారు. స్నేహపూరిత వాతావరణంలో, క్రీడా స్పూర్తి గల పలువురు యువ క్రికెటర్లకు ఈ ప్రాంతం ఒక వేదిక కావడం ఒక అదృష్టంగా భావిస్తున్నట్లు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 క్రికెట్ జట్లు వై.యస్.ఆర్-పి.కె.యం క్రికెట్ టోర్నమెంట్ సీజన్ – 2 లో పాల్గోవడం శుభసూచకమన్నారు
ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు లంకా సూరిబాబు, తంటిపూడి కవితా నోబుల్ థామస్, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ షేక్ ముస్తఫా ( అచ్చాబా), వైస్ ఛైర్మెన్ తోట సత్యనారాయణ, కృష్ణాజిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు గూడవల్లి నాగరాజు, 50 డివిజన్లకు చెందిన పలువురు కార్పొరేటర్లు, పలువురు వైయస్సార్ సిపి నాయకులు క్రికెట్ క్రీడా అభిమానులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
ఇంద్రకీలాద్రి పై సంక్రాంతి వేడుకలు 2 వ రోజు…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : తేదీ. 13-01-2025 నుండి తేదీ. 15-01-2025 వరకు సంక్రాంతి వేడుకలు సందర్బంగా మంగళవారం ‘సంక్రాంతి’ …