Breaking News

ఆరోగ్యకర జీవనం కన్నా మించింది లేదు…

-తెనాలి సబ్ కలెక్టర్ Dr.నిథిమీనా I.A.S

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
మంచి ఆరోగ్యకరమైన జీవనం కన్నా మించింది లేదని తెనాలి సబ్ కలెక్టరు నిథిమీనా I.A.S. అన్నారు. గురు వారం అంతర్జాతీయ మహిళా సంవత్సరం వారోత్సవాల సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కాన్ఫరెన్స్ హాలులో 15-45 సం॥రాల మథ్యమహిళలకు వేదిస్తున్న కేన్సర్ తొలిదశలోనే నిర్మూలనకు స్క్రీనింగ్ టెస్టుల ప్రారంభిస్తూ తొలిదశలోనే గుర్తిస్తే కేన్సర్ పూర్తి నిర్మూలన సాథ్యపడు తుందన్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి Dr.శారద చొరవ తీసుకొని ప్రతి గడప వద్దకెళ్ళి మహిళలన చైతన్యవంతులని చేయటం హర్షణీయమని అన్నారు.

Dr.శారద మాట్లాడుతూ రొమ్ము గర్భాశయ ముఖ ద్వార కేన్సర్ లక్షణాలను తొలిదశలో గుర్తిస్తే రాబోవు ప్రమాద కారకాలను నివారించవచ్చని దీన్ని గురించి మహిళలను ఒకరి నుంచి మరొకరి ద్వారా అందరు చైతన్యవంతం చేయాలన్నారు.టెస్టు ఫలితాలను సంబంథింతులకు వెంటనే చేర వేస్తామన్నారు. దీనికి సహకరిస్తున్న ICDS గీతాంజలి, సూపర్వైజర్లకు అంగన్వాడిలకు కృతఙ్ఞతలు తెలిపారు.

ఛైర్మన్ ఖాలేద నశీం మాట్లాడుతూ కేన్సర్ అన్న విషయం తెలియకుండా శరీరం అంతా వ్యాపిస్తుందని దాన్ని మొగ్గదశలో తుంచి థైర్యంగా ప్రశాంత మనుగడ సాగించాలన్నారు.

మనోరంజని గీతాంజలిICDS లు మాట్లాడుతూ అనిమియా లక్షణాలతో అన్నవారిని గుర్తించి వారి ఎదుగుదల కు మందులు ఇస్తామన్నారు. కేన్సర్ కు వేక్సినేషన్ వచ్చిందని Dy.DMHO అన్నపూర్ణ అన్నారు. సూపరింటెండ్ సౌభాగ్యవాణి , పలువురు డాక్టర్లు ఈ స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *