-నగరపాలక సంస్థ కమిషనర్ పి.రంజిత్ బాషా, ఐ.ఏ.ఎస్.,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్ను, మంచి నీటి కుళాయి పన్ను మరియు డ్రైనేజి పన్ను మొదలగు అన్ని రకాల పన్ను బకాయిలను వెంటనే చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని నగర కమీషనర్ పి.రంజిత్ బాషా, ఐ.ఏ.ఎస్ పన్ను చెల్లింపు దారులకు విజ్ఞప్తి చేసారు. విజయవాడ నగర పాలక సంస్థ రెండవ ఆర్ధిక సంవత్సరమునకు సంబంధించి పెండింగ్ లో ఉన్న వివిధ రకాల పన్ను చెల్లింపు దారులు ది. 31-03-2022 లోపుగా పన్ను బకాయిలు చెల్లించాలని, అట్లు పన్నులు చెల్లించని వారి నివాసాల లేదా వాణిజ్య సముదాయాలకు సంబందించిన వాటర్, డ్రైనేజి కనెక్షన్ ను నిలిపివేయుటతో పాటుగా కమీషనర్ వారి ఆదేశముల మేరకు రెవిన్యూ చట్ట నిబంధనల ప్రకారం దీర్ఘ కాలిక పన్ను బకాయిదారుల యొక్క ఆస్తులు జప్తు చేయుటకు చర్యలు తీసుకోవటం జరుగునని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని మూడు సర్కిల్ కార్యాలయాల పరిధిలో కాష్ కౌంటర్స్ ని ఏర్పాటు చేయడం జరిగినదని, సెలవు దినములలో కూడా సదరు కౌంటర్లు పని చేస్తాయని డిప్యూటీ కమీషనర్ (రెవిన్యూ) డి. వెంకట లక్ష్మి తెలియజేసారు.
సర్కిల్ – 1 – హౌసింగ్ బోర్డ్ కాలని, (భవానిపురం ఓల్డ్ పోలీస్ స్టేషన్ -1 కాష్ కౌంటర్
మరియు సర్కిల్ – 1 ఆఫీసు – 1కాష్ కౌంటర్
సర్కిల్ – 2 – అజిత్ సింగ్ నగర్ – 1 కాష్ కౌంటర్, పాయకాపురం – 1 కాష్ కౌంటర్
మరియు సర్కిల్ – 2 ఆఫీసు – 2 కాష్ కౌంటర్లు
సర్కిల్ – 3 – సాయిబాబా గుడి రోడ్, స్టెల్లా కాలేజీ దగ్గర – 1 కాష్ కౌంటర్,
హై స్కూల్ రోడ్, సచివాలయం 102, కృష్ణలంక – హై స్కూల్ రోడ్, సచివాలయం 102, కృష్ణలంక – 1 కాష్ కౌంటర్, ESI హాస్పిటల్ రోడ్, గుణదల- 1 కాష్ కౌంటర్ మరియుసర్కిల్ – 3 ఆఫీసు – 2 కాష్ కౌంటర్లు.
సదరు అవకాశాన్ని విజయవాడ నగర ప్రజలు సద్వినియోగ పరచుకోనవలసినదిగా కోరడమైనది.