ఆకస్మిక తనిఖీలు చేపట్టిన రవాణాశాఖ


-38 బస్సులపై కేసులు నమోదు రూ.12 లక్షలు జరిమానా విధింపు
-బస్సులలో సరుకు రవాణా చేస్తే సీజ్ చేస్తాం-
-డిటిసి యం పురేంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ:- ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై వాణిజ్యపరమైన సరుకులను రవాణా చేస్తే పర్మిట్ నిబంధనలను ఉల్లంఘించడం అవుతుందని అటువంటి బస్సులపై కేసు నమోదుతో పాటు బస్సులను సీజ్ కూడా చేస్తామని డి టి సి యం పురేంద్ర హెచ్చరించారు.

స్థానిక బందరు రోడ్డు డిటిసి కార్యాలయం నుండి శుక్రవారం నాడు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా డిటిసి యం పురేంద్ర మాట్లాడుతూ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులలో సరుకు రవాణా చేస్తున్న నేపథ్యంలో డి టి సి యం పురేంద్ర జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎనిమిది మంది మోటారు వాహన తనిఖీ అధికారులతో ఐదు బృందాలను ఏర్పాటు చేసి సరుకు రవాణా చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై తనిఖీలు నిర్వహించారు. బస్సుల పైభాగంలో, అలానే ప్రయాణికులు లగేజి పెట్టె బస్సు అండర్ చాంబర్లలో వాణిజ్యపరమైన సరుకు రవాణా చేస్తున్న పలు బస్సులపై, పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న బస్సులపై కేసులు నమోదు చేయడమైనదన్నారు. ఒక్కరోజే 38 బస్సులపై కేసులు నమోదు చెయ్యడం, సుమారు 12 లక్షల రూపాయల వరకు పెనాల్టీలు విధించడం జరిగిందన్నారు. సరుకు రవాణాను పార్సిల్ బాక్సులు, బండిల్స్ , పెట్టెలు, మూటలు రూపంలో కట్టుకొని బస్సులలో తీసుకు వెళ్తున్నారన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడుపుటకు తీసుకున్న పర్మిట్ నిబంధనల ప్రకారమే బస్సులు నడపాలని ఆయన సూచించారు. బస్సుల యజమానులు కొందరు అత్యాశకు పోయి ఇలా బస్సులలో సరుకు రవాణా చేస్తున్నారన్నారు. బస్సులలో ప్రయాణికుల లగేజీ తప్ప ఏ ఇతర సరుకులను ఎక్కించరాదన్నారు. బస్సులపై అధికలోడును గాని, ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకున్న గాని పర్మిట్ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నట్లేనని ఆయన పేర్కొన్నారు. అటువంటి వాహనాలపై 25 వేల నుండి 50 వేల వరకు జరిమానా విధించడం జరుగుతుందని అన్నారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని డిటిసి పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *